అక్షరటుడే, వెబ్డెస్క్ : Car Fell Into Well | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు.
నాసిక్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండోరిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా 9 మంది జలసమాధి అయ్యారు. దిండోరిలోని ఇండోర్ గ్రామానికి (Indoor Village) చెందిన బాధితులు, పట్టణంలో జరిగిన ఒక కోచింగ్ క్లాస్ సమావేశానికి హాజరైన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది.
Car Fell Into Well | ఒకే కుటుంబం..
స్థానిక అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం శివాజీనగర్ (Shivajinagar)లో ఒక సామాజిక కార్యక్రమానికి హాజరైంది. కార్యక్రమం తర్వాత సునీల్ దత్తాత్రేయ దర్గోడే తన కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తుండగా వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కకు వెళ్లి, సమీపంలో నీటితో నిండిన బావిలో పడిపోయింది. దీంతో వారు బయటకు రాలేకపోయారు.
Car Fell Into Well | క్రేన్సాయంతో..
కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. పోలీసులు, స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు, ఆ తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలలో పాల్గొన్నాయి. గంటల పాటు శ్రమించి క్రేన్‌ల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సునీల్ దత్తాత్రేయ దర్గోడే (34), అతని భార్య రేష్మా(30), వారి కుమార్తె రాఖీ అలియాస్ గుణవంతి (10), మేనకోడళ్లు మాధురి (13), శ్రావణి (11), ఆశా అనిల్ దర్గోడే (32), ఆమె కుమారుడు 11 ఏళ్ల శ్రేయాష్, కుమార్తె 14 ఏళ్ల సృష్టి, మేనకోడలు సమృద్ధి (7) కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి..: PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
