Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Caste Discrimination Case | కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే..: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Caste Discrimination Case | కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే..: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

నిజామాబాద్

Caste Discrimination Case | కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే..: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

గ్రామాల్లో దళితులపై కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందేనని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 6:07 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Caste Discrimination Case

అక్షరటుడే, కామారెడ్డి: Caste Discrimination Case | గ్రామాల్లో దళితులపై కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందేనని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కామారెడ్డి మండలం (Kamareddy Mandal) నర్సన్నపల్లి గ్రామంలో బుధవారం దళితులకు ఆలయ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Contents
  • Caste Discrimination Case | తమను చిన్నచూపు చూస్తునారు..
    • Caste Discrimination Case | ఇప్పటికీ వివక్ష చూపడం బాధాకరం
      • Caste Discrimination Case | కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ కలెక్టర్ విక్టర్

Caste Discrimination Case | తమను చిన్నచూపు చూస్తునారు..

గ్రామంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై బక్కి వెంకటయ్య విచారణ జరిపారు. దళితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితులు తాము ఏ విధంగా వివక్షకు గురవుతున్నామో ఛైర్మన్​కు వివరించారు. గ్రామంలోని ఆలయాల్లోకి తమకు ప్రవేశం కల్పించడం లేదని, అగ్రవర్ణాల పెద్దలు తమను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. గ్రామంలో ఇంటింటికీ విరాళాలు సేకరించి శివాలయం నిర్మించడం జరిగిందని, విగ్రహ ప్రతిష్ఠాపన రోజు తమ కాలనీలో విగ్రహాన్ని ఊరేగించేందుకు అగ్రవర్ణాలు ప్రజలు వివక్ష చూపారని, చివరికి విగ్రహం తాకేందుకు కూడా ఒప్పుకోలేదన్నారు. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే అందరికీ కావాల్సిన వ్యక్తి అని తాము ఉచితంగా డప్పు కొట్టడానికి వెళ్తే అవసరం లేదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి శ్మశాన వాటికలో అంత్యక్రియలకు తమకు అవకాశం కల్పించడం లేదన్నారు.

Caste Discrimination Case

Caste Discrimination Case | ఇప్పటికీ వివక్ష చూపడం బాధాకరం

అనంతరం ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇప్పటికీ కులం అంటూ వివక్ష చూపడం బాధాకరమన్నారు. కులాలు అనేది వృత్తిపరమైనవి మాత్రమేనని, వాటిని అక్కడికే పరిమితం చేసి అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఈ తరహా ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయన్నారు. ఈ ఘటనలో ఎంతమందిపై కేసులు నమోదు చేశారని, విచారణ ఎలా జరిపారని ఎస్సైని ప్రశ్నించారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముగ్గురిపైనే కాకుండా ఘటనకు కారణమైన వాళ్లు 30 మంది తేలినా అందరిపై కేసు నమోదు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నర్సన్నపల్లి గ్రామంలో (Narsannapalli Village) ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇది చీకటి రోజుగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల చివరి వారంలో గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, కులవివక్ష, ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించాలని, ఆ కార్యక్రమానికి తనకు ముందే సమాచారమిస్తే వస్తానని పేర్కొన్నారు.

Caste Discrimination Case

Caste Discrimination Case | కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ కలెక్టర్ విక్టర్

గ్రామంలో కులవివక్ష చూపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor) హెచ్చరించారు. కులవివక్ష బాధ అనుభవించే వారికే తెలుస్తుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, శ్మశాన వాటికలో అందరికీ అనుమతి ఉంటుందని, అక్కడ కూడా వివక్ష చూపిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కిందకు వస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను గ్రామంలోని అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, లేకపోతే చట్ట వ్యతిరేకత కిందకు వస్తుందని తెలిపారు. భవిష్యత్​లో గ్రామంలో ఎలాంటి వివక్ష కనిపించకూడదన్నారు. అనంతరం దళితులతో కలిసి ర్యాలీగా వెళ్లి గ్రామంలోని హనుమాన్ మందిరం, శివాలయాలలో కొబ్బరికాయ కొట్టి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. అనంతరం అధికారులు దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రాజశేఖర్, డీటీడీవో సౌజన్య, తహశీల్దార్ హిమబిందు, అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, భీం ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రవి, గ్రామస్థులు స్వామి, రాజు, బాలరాజు, నర్సింలు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hanuman Shobha Yatra | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు.. రూట్​మ్యాప్​ ఇదే..

Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
TAGGED:Additional Collector VictorCaste Discrimination Casedalit rights indiaDr. Babasaheb Ambedkarequality rightsKamareddy MandalKamareddy NewsNarsannapalli VillageSC ST Commission
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Rally Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Next Article NATO Alliance NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?