అక్షరటుడే, హైదరాబాద్: CDK india | ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘సీడీకే’ (CDK), తన ఉద్యోగుల కోసం నిర్వహించిన ‘కన్వర్జెన్స్ 2026’ వేడుకలు (CDK india) ఘనంగా ముగిశాయి. హైదరాబాద్, పుణె నగరాల్లోని కార్యాలయాల పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఏడాది “మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం” అనే నినాదంతో, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉమ్మడి కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
CDK india | విజయాలకు వెన్నుదన్నుగా..
ఉద్యోగులకు అత్యుత్తమ పని వాతావరణాన్ని కల్పిస్తున్న సంస్థగా సీడీకే 2019 నుండి వరుసగా ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ (GPTW) సర్టిఫికేషన్ పొందుతోంది. 2025లో దేశంలోని టాప్ 100 ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఈ సంస్థ, తమ ప్రతి విజయానికి ఉద్యోగుల వెనుక ఉన్న వారి కుటుంబాలే అసలైన పునాది అని ఈ వేడుక ద్వారా చాటిచెప్పింది.
CDK india | ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కన్వర్జెన్స్ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వేదికపై ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సంగీత కచేరీలు ప్రత్యేక ఫ్యాషన్ వాక్ కార్యక్రమాలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో కుండల తయారీ వంటి గ్రామీణ కళలు, ఆటల పోటీలు చిన్నారులను అలరించాయి. ఇదే సందర్భంలో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక అవార్డులను అందజేసి వారిని సత్కరించారు.
నాయకత్వ సందేశం..
ఈ సందర్భంగా సీడీకే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. “మా ఉద్యోగులు సాధించే ప్రతి ఘనత వెనుక వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. తెలివైన కుటుంబాలే గొప్ప జట్లను రూపొందిస్తాయని, ఆ జట్లే సంస్థను అగ్రస్థానంలో నిలుపుతాయని మేము బలంగా నమ్ముతాము” అని అన్నారు.
సీనియర్ డైరెక్టర్ (హెచ్ఆర్) ఆశిష్ సక్సేనా మాట్లాడుతూ.. “మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉండటమే మా బలం. ఈ వేడుక కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మన మధ్య ఉండే గౌరవం ఐక్యతను పెంపొందించుకోవడానికి ఒక వేదిక” అని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి..: Axis Finance | వినియోగదారుల భద్రతకు పెద్దపీట.. ఏఐ మానిటరింగ్‌ను ప్రారంభించిన యాక్సిస్ ఫైనాన్స్

