Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం

జాతీయం

Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి కోసం భవ్య పథకానికి ఆమోదం తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 6:34 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Central Cabinet Decisions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Central Cabinet Decisions | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్ట్​లకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

Contents
  • Central Cabinet Decisions | జల విద్యుత్​ కోసం..
    • Central Cabinet Decisions | పత్తి రైతులకు గుడ్​న్యూస్​

కేంద్ర మంత్రివర్గం రూ. 33,660 కోట్లతో భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు, రూ.33,660 కోట్ల భారీ పెట్టుబడుల ప్రోత్సాహం అందించనుంది. ఈ పథకం భారతదేశ తయారీ సామర్థ్యాన్ని వెలికితీసి, దేశ వృద్ధిని ముందుకు నడిపిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ (Ashwini Vaishnaw) అన్నారు. వ్యాపారం చేసే సౌలభ్యాన్ని కల్పించడమే భవ్య పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పారిశ్రామిక పార్కులు 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఐసీటీ నెట్‌వర్క్‌లు, పరిపాలనా సౌకర్యాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వీటికి ఎకరాకు రూ.1 కోటి వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రాష్ట్రాలు, ప్రైవేట్ రంగంతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుంది.

Central Cabinet Decisions | జల విద్యుత్​ కోసం..

జల విద్యుత్ అభివృద్ధి పథకానికి కేబినెట్​ రూ.2,585 కోట్లు కేటాయించింది. సుమారు 1,500 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 2,584.60 కోట్ల కేటాయింపుతో ‘చిన్న జల విద్యుత్ (SHP) అభివృద్ధి పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు (1-25 మెగావాట్ల సామర్థ్యం) మద్దతు ఇస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.

Central Cabinet Decisions | పత్తి రైతులకు గుడ్​న్యూస్​

cotton

పత్తి రైతులకు కేంద్రం గుడ్​న్యూస్​ చెప్పింది. 2023-24 పత్తి సీజన్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)కు రూ.11,712 కోట్ల కనీస మద్దతు ధర (MSP) నిధులను ఆమోదించింది. 2023–24 సీజన్‌లో దేశవ్యాప్తంగా 114.47 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనా. 325.22 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. కేంద్ర నిర్ణయంతో సుమారు 7.25 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అలాగే NH-92 బారాబంకి నుంచి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయించింది.

 

దీనిని కూడా చదవండి : Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
TAGGED:Central CabinetCotton MSPHydropower ProjectsIndia GovernmentIndustrial SchemeInfrastructure Development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Red Jowar Bonus | Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Next Article prison Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?