Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?

జాతీయం

Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనం 34 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 12:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Central Government Salary Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతన సవరణపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. వేతన సవరణ జరిగితే రక్షణ విభాగాలు, రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో నేరుగా పనిచేసే వారికి, అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. 34 శాతం వరకు వేతనం పెరగవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది 8వ వేతన సంఘం సంబంధిత అంచనాలు/సిఫారసులు మాత్రమే.

Contents
  • Central Government Salary Hike | జీతాలు ఎంత పెరగొచ్చంటే?
    • Central Government Salary Hike | డీఏ 2 శాతం పెరిగే అవకాశం
      • Central Government Salary Hike | గతేడాది కమిషన్ ఏర్పాటు

Central Government Salary Hike | జీతాలు ఎంత పెరగొచ్చంటే?

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) అనేది జీతాల పెంపును నిర్ణయించే కీలక అంశం. ద్రవ్యోల్బణం, డీఏ, ఆర్థిక వృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ధారిస్తారు. ఏడో వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 గా నిర్ణయించారు. ఎనిమిదో వేతన సంఘం కూడా దీనినే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే ఫిట్‌మెంట్ ఆధారంగా వేతనం పెంచితే ఉద్యోగుల కనీస బేసిక్ పే ఏకంగా రూ.46 వేలకు చేరనుంది. ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు కూడా 34 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పెంపు జనవరి 2026 నుంచి అమలు కావచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు.

Central Government Salary Hike | డీఏ 2 శాతం పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Central government employees) వేతనం 34 శాతం పెరిగినా అది మొత్తం వేతనంపై ఉండదు. ఇది బేసిక్ పేలో మార్పు, డీఏ మార్జ్, ఇతర అలవెన్సులు కలిపి సగటు ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఏడో వేతన సంఘం సిఫారసుల ఆధారంగా వేతనం అందుతోంది. డీఏ ప్రస్తుతం 58 శాతంగా ఉంది. ఇది 2 శాతం పెంపుతో 60 శాతానికి చేరుతుందని ఆశిస్తున్నారు. డీఏ పెంపును ఈ నెలలో ప్రకటించే అవకాశాలున్నాయి.

Central Government Salary Hike | గతేడాది కమిషన్ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం (Central Government) 2025 లో ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 18 నెలల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటరిమ్ రిపోర్ట్ త్వరలో వస్తుందని భావిస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చే ఏడాది వస్తుందన్న అంచనాలున్నాయి. ఎనిమిదో వేతన సంఘం ఫైనల్ సిఫారసులు వచ్చాక, దానిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించాకే వేతనాల పెంపుపై స్పష్టత రానుంది. కాగా ఆ సిఫార్సులు 2026 జనవరి 1 నుంచే అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Delhi CCTV Removal | ఢిల్లీలో భారీగా సీసీ కెమెరాల తొలగింపు

India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
TAGGED:Central GovernmentCentral government employeesCentral Government Salary HikeFitment Factor
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fertilizer Import Duty Removal Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు
Next Article Hanuman Yatra Begins in Nizamabad  Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?