అక్షరటుడే, ఇందూరు: Cervical Cancer Vaccine | ప్రతి అమ్మాయి క్యాన్సర్ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) సూచించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(Allu Arjun fans) ఆధ్వర్యంలో చేపట్టిన వాల్పోస్టర్లను శనివారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
Cervical Cancer Vaccine | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 14 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేస్తుందన్నారు. దీనికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ (allu arjun) మద్దతుగా నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడకుండా (Vaccination drive) ఈ వ్యాక్సిన్ ఎంతో తోడ్పడుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో(GGH Nizamabad) వ్యాక్సిన్ (Public health campaign) అందుబాటులో ఉందన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చొరవ తీసుకొని అవగాహన కల్పించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల సురేష్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, దీపక్, మహేష్, కృష్ణ, కార్తీక్, గోపి తదితరులు పాల్గొన్నారు.

