Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!

Naresh chandan
Last updated: మార్చి 22, 2026 4:54 సా.
Naresh chandan
4 రోజులు ago
Share
Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cesarean Recovery Tips | ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు లేదా జీవనశైలి మార్పుల కారణంగా ఈ రోజుల్లో చాలామందికి సిజేరియన్ ఆపరేషన్లే జరుగుతున్నాయి. అయితే, సహజ ప్రసవం (కానుపు) తో పోలిస్తే సిజేరియన్ తర్వాత శరీరం మునుపటి స్థితికి రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.

Contents
  • Cesarean Recovery Tips | విశ్రాంతికి మొదటి ప్రాధాన్యం:
    • Cesarean Recovery Tips | పాలిచ్చే విధానం:
      • పోషకాహారం తీసుకోవడంలో అశ్రద్ధ వద్దు:

ఈ క్రమంలో చాలామంది తల్లులు దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయని లేదా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతుంటారు. కానీ, ప్రసవానంతరం సరైన జీవనశైలి, వైద్యుల సూచనలు పాటిస్తే చాలా త్వరగా కోలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Cesarean Recovery Tips | విశ్రాంతికి మొదటి ప్రాధాన్యం:

ఆపరేషన్ తర్వాత కుట్లు త్వరగా మానాలన్నా, అంతర్గత గాయాలు నయం కావాలన్నా విశ్రాంతిని మించిన మందు లేదు. కొత్తగా తల్లైన వారికి శిశువుకు పాలివ్వడం, దుస్తులు మార్చడం, వారిని నిద్రపుచ్చడం వంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంది. దీనివల్ల తల్లులకు సరైన నిద్ర ఉండదు, ఫలితంగా ఒత్తిడి పెరుగుతుంది.

ఇది తల్లి ఆరోగ్యానికే కాకుండా బిడ్డకు కూడా మంచిది కాదు. అందుకే నిపుణులు ఇచ్చే ప్రధాన సలహా ఏంటంటే.. శిశువు నిద్రపోయిన ప్రతిసారీ తల్లులు కూడా ఇతర పనులను పక్కన పెట్టి నిద్రకు ఉపక్రమించాలి. దీనివల్ల శరీరం త్వరగా శక్తిని పుంజుకుంటుంది.

Cesarean Recovery Tips | పాలిచ్చే విధానం:

బిడ్డకు పాలివ్వడం అనేది కేవలం శిశువు ఆకలి తీర్చడమే కాదు, అది తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రసవం తర్వాత పెరిగిన బరువును తగ్గించడమే కాకుండా, త్వరగా మళ్లీ గర్భం దాల్చకుండా సహజమైన నియంత్రణగా పనిచేస్తుంది.

అయితే, పాలిచ్చే సమయంలో తల్లులు కూర్చునే విధానం (Posture) చాలా కీలకం. పాలిచ్చేటప్పుడు ముందుకు లేదా వెనక్కి వంగిపోకుండా నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిజేరియన్ తర్వాత వచ్చే దీర్ఘకాలిక నడుము నొప్పిని నివారించవచ్చు. అవసరమైతే సౌకర్యం కోసం ఫీడింగ్ పిల్లోలను ఉపయోగించడం ఉత్తమం.

పోషకాహారం తీసుకోవడంలో అశ్రద్ధ వద్దు:

మన సమాజంలో బాలింతలకు ఆహారం విషయంలో అనేక ఆంక్షలు విధిస్తుంటారు. ఇది తినకూడదు, అది తాగకూడదు అని భయపెడుతుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, బాలింతలకు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు అవసరం లేదు.

గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి బలమైన , పోషకాలున్న ఆహారం తీసుకున్నారో, ప్రసవం తర్వాత కూడా వైద్యుల సలహాతో అన్ని రకాల పండ్లు, కూరగాయలు , పప్పు ధాన్యాలను తీసుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఆపరేషన్ గాయాలు త్వరగా మానడమే కాకుండా, బిడ్డకు సరిపడా పాలు కూడా అందుతాయి.

ఇది కూడా చదవండి: High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!

Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
TAGGED:baby carec section recoverycesarean recoveryhealthy dietmaternal healthnew mother healthpostpartum carerecovery tips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Electricity Workers Strike | Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!
Next Article Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా! Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?