Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం

క్రీడలు

Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ఆరు నెలలుగా మద్యం మానేశానని వెల్లడించిన ఆయన, జట్టుకు 150 శాతం ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని చెప్పాడు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 19, 2026 12:58 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Chahal Fitness IPL 2026
Highlights

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్.. ఆరు నెలలుగా మద్యానికి దూరంటీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ Chahal ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడం కోసం ఆరు నెలలుగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉన్నానని ఆయన వెల్లడించాడు..

    Contents
    • Chahal Fitness IPL 2026 | ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి
      • Chahal Fitness IPL 2026 | అందుకే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ
        • Chahal Fitness IPL 2026 | టైటిల్ అందించడమే ప్రధాన లక్ష్యం

    దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చాహల్ ఈ విషయాలను వెల్లడించాడు. తన కెరీర్ చివరి దశలో మరింత ఫిట్‌గా ఉండి జట్టుకు పూర్తి స్థాయిలో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు..

    Chahal Fitness IPL 2026 | ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి

    ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ.. నేను మద్యం సేవించడం మానేసి ఇప్పటికే ఆరు నెలలకు పైగా అయింది. ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. ఈ వయసులో కూడా మైదానంలో చురుకుగా ఉండి నా జట్టు కోసం 150 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను” అని చెప్పాడు.

    Chahal Fitness IPL 2026 | అందుకే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ

    జట్టులో సీనియర్ ఆటగాడిగా ఇతరులు తనను చూసి ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నానని, అందుకే ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుతున్నానని వివరించాడు. గత ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడినప్పటికీ చివరికి టైటిల్ దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ Shreyas Ayyer నాయకత్వంలోని జట్టు ఫైనల్ వరకు దూసుకెళ్లింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ ఓటమి ఇప్పటికీ తనను బాధిస్తోందని చాహల్ పేర్కొన్నాడు.

    ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారిందని చాహల్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్‌లో మేము యాన్సెన్‌ను చాలా మిస్ అయ్యాం. అతను జట్టులో ఉండి ఉంటే మేం కచ్చితంగా ఛాంపియన్ అయ్యేవాళ్లం. బౌలింగ్‌తో పాటు చివరలో భారీ సిక్సర్లు కొట్టే అతని సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడేది అని చాహల్ తెలిపాడు.

    Chahal Fitness IPL 2026 | టైటిల్ అందించడమే ప్రధాన లక్ష్యం

    గత సీజన్ చివరి దశలో తన ప్రదర్శనపై కూడా చాహల్ నిరాశ వ్యక్తం చేశాడు. కేకేఆర్‌తో KKR జరిగిన మ్యాచ్ తర్వాత తన పక్కటెముక విరగడంతో పాటు వేలికి కూడా ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పాడు. ఆ గాయాల కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో తన అసలైన లెగ్ స్పిన్ బౌలింగ్ చేయలేకపోయానని తెలిపాడు. ఈ సీజన్‌లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇప్పుడు తన శరీర ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టానని చాహల్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌కు టైటిల్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.

    ఇది కూడా చదవండి..: BCCI Contract Changes | బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులతో బుమ్రాకు షాక్?.. రూ.2 కోట్ల నష్టం అంటూ సోషల్ మీడియాలో చర్చ

    T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
    West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
    T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
    Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
    BCCI ODI Plans | 2027 వన్డే వరల్డ్‌కప్ లక్ష్యం.. బీసీసీఐ కొత్త వ్యూహం, మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడ‌నున్న టీమిండియా
    TAGGED:chahal fitness ipl 2026chahal fitness journeycricket fitness newsindian cricket newsipl 2026 updatespunjab kings newsyuzvendra chahal news
    Share This Article
    Facebook Whatsapp Whatsapp
    Sandeep kumar Balla_Author
    BySandeep Kumar Balla
    Follow:
    Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
    Previous Article Stock Market Crash Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..
    Next Article Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి! Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
    వ్యాఖ్యలు లేవు

    స్పందించండి స్పందనను రద్దుచేయి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

    Akshara Today

    ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

    Quick Links

    • Home
    • About Us
    • Contact Us
    • Advertise With Us

    Policies and Guidelines

    • Disclaimer
    • Privacy Policy
    • Corrections Policy
    • Terms and Conditions

    Follow Us

    © 2023 Akshara Today Network. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?