Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​భక్తి

Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 21, 2026 11:46 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 రోజులు ago
Share
Chandrababu Tirumala visit

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chandrababu Tirumala visit | ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు దేవాన్ష్​ జన్మదినం సందర్భంగా సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేష్ (Minister Lokesh)​తో కలిసి శ్రీవారిని శనివారం ఉదయం దర్శనం చేసుకున్నారు.

Contents
  • Chandrababu Tirumala visit | స్వాగతం పలికిన అర్చకులు
    • Chandrababu Tirumala visit | వేద పండితుల ఆశీర్వాదం
      • Chandrababu Tirumala visit | భక్తులకు ఆహారం వడ్డించిన సీఎం

Chandrababu Tirumala visit | స్వాగతం పలికిన అర్చకులు

సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ (Vaikuntam Queue Complex) ద్వారా ఆలయంలోకి వెళ్లారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, యోగనరసింహ స్వామివారిని దర్శనం చేసుకుని.. హుండీలో కానుకలు సమర్పించారు.

Chandrababu Tirumala visit | వేద పండితుల ఆశీర్వాదం

శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరిలు.. ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్ అందించారు.

Chandrababu Tirumala visit

Chandrababu Tirumala visit | భక్తులకు ఆహారం వడ్డించిన సీఎం

తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుమడు దేవాన్ష్​తో కలిసి భక్తులకు ఆహారం వడ్డించారు. అనంతరం సతీమణి, కుమారుడు, మనుమడితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్​వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాం. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించాం. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో… pic.twitter.com/QWhYzwyQTE

— N Chandrababu Naidu (@ncbn) March 21, 2026

ఇది కూడా చదవండి..: Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!

 

 Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత
AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
TAGGED:Chandrababu Tirumala visitMinister LokeshTirumalaVaikuntam Queue Complex
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ramzan Celebrations Nizamabad Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Next Article Karimnagar SI Suicide Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?