Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం

ఆంధ్రప్రదేశ్​

Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం

తిరుపతి రూరల్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగ గంటపాటు ఉన్నా చోరీ చేయకుండా పరారయ్యాడు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 28, 2026 1:39 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Cheddi Gang in Tirupathi

Cheddi Gang in Tirupathi | పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ (Raghunatha Resorts) ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈసారి దొంగతనం ప్రయత్నం విఫలమవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సునంద కుమార్ రెడ్డి నివాసంలోకి ముగ్గురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి 2:20 గంటల సమయంలో చేరుకుంది. వారిలో ఒకరు మాత్రమే ఇంట్లోకి చొరబడగా, మిగిలిన ఇద్దరు బయట గమనిస్తూ నిలబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగ దాదాపు గంటకు పైగా, అంటే 3:30 గంటల వరకు అక్కడే సంచరించాడు.

Cheddi Gang in Tirupathi | దొంగ‌త‌నం చేయ‌లేక‌పోయాడు..

అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మూడు బెడ్‌రూమ్‌లలో నిద్రిస్తున్నప్పటికీ, ఎలాంటి చోరీ జరగకముందే దొంగ అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యాడు. దొంగతనం ఎందుకు చేయలేకపోయాడనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో తిరుపతి రూరల్ పోలీసులు (Tirupati Rural Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్లను సేకరించి నిందితుల ఆనవాళ్ల కోసం శోధిస్తున్నారు.

ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ (Cheddy Gang) సంచారం నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రిపూట గస్తీని పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతున్నారు. స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో తిరుపతిలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కనుగొని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Tirumala Vasanthotsavam | తిరుమలలో ఈ నెల 30 నుంచి వసంతోత్సవాలు

Bride Elopes Wedding | పెళ్లిపీటల నుంచి లేచి.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు
Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
TTD Ghee Tanker Accident | టీటీడీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. 21 వేల లీటర్ల నెయ్యి తోడేసిన స్థానికులు
Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
TAGGED:Andhra Pradesh policeburglary attemptCCTV footage caseCheddi Gang in TirupathiCheddi gang IndiaCheddy GangCrime Investigationfailed theft caseRaghunatha ResortsTirupati crime newsTirupati rural newsTirupati Rural Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indigo Emergency Landing Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Next Article Young India School Construction Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?