అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో ఏరియా డామినేషన్ ఆపరేషన్ సందర్భంగా సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Chhattisgarh IED Blast | బీజాపూర్ జిల్లాలో..
బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో ఒక ఉమ్మడి బృందం ఏరియా డామినేషన్ ఆపరేషన్‌లో నిర్వహిస్తుంది. మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ IED పేలుడులో ఇద్దరు STF జవాన్లు గాయపడ్డారని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ (SP) జితేంద్ర యాదవ్ తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా దళాలు గాయపడిన సైనికులకు ప్రథమ చికిత్స అందించాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు.
Chhattisgarh IED Blast | హై అలెర్ట్..
ఐఈడీ పేలుడు తర్వాత భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ఆ ప్రాంతంలో మావోయిస్టులు మరిన్ని మందుపాతరలు పెట్టి ఉంటారని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మందుపాతరల తొలగింపు కోసం ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపడుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 21న 17 IEDలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అన్ని పేలుడు పదార్థాలు అక్కడికక్కడే సురక్షితంగా ధ్వంసం చేయబడ్డాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భూమిలో పాతిపెట్టిన అనుమానాస్పద పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి శోధన, ప్రాంత ఆధిపత్య కార్యకలాపాలు కొనసాగుతాయని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం

