Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​పై మండిపడ్డారు. దళితుడు స్పీకర్​గా ఉండటంతో కేసీఆర్​ సభకు రావడం లేదని ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 1:58 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
CM Revanth Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Budger Session) వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా రాఘవ కన్​స్ట్రక్షన్​ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Contents
  • CM Revanth Reddy | హరీశ్​రావు తమ్ముడి అక్రమాలు
    • CM Revanth Reddy | వారిని జైలులో పెట్టాలి
      • CM Revanth Reddy | బీఆర్​ఎస్​ సభ్యుల సస్పెన్షన్​

తెలంగాణకు ఎస్సీని తొలి సీఎం చేస్తానని కేసీఆర్​ (KCR) మాట తప్పారని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ హయంలో దళితులను చిన్న చూపు చూశారని ఆరోపించారు. తామ ప్రభుత్వంలో

ప్రజా ప్రభుత్వంలో భట్టి విక్రమార్క, సీతక్క వంటి దళిత, గిరిజన నేతలకు సముచిత స్థానం కల్పించామన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్ చేశామన్నారు. స్పీకర్ స్థానంలో దళితుడు ఉండటంతోనే కేసీఆర్ సభకు రావడం లేదని ఆరోపించారు. గతంలో పదవులన్నీ ఒకే కుటుంబానికి దక్కాయని విమర్శించారు.

CM Revanth Reddy | హరీశ్​రావు తమ్ముడి అక్రమాలు

ధరణిని అడ్డం పెట్టుకొని మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్​లో హరీష్ రావు తమ్ముడు (Harish Rao Brother) మహేశ్ రావు, మామ హన్మంతరావు వందల కోట్ల భూమిని లాక్కున్నారని సీఎం ఆరోపించారు. సేల్ డీడ్ లేకుండా కంపెనీ యజమానులను బెదిరించి దౌర్జన్యంగా భూ బదలాయింపు చేసుకున్న దానిపైన హౌజ్ కమిటి వేయడానికి తాము సిద్ధం అన్నారు. బాలనగర్​లో వందల కోట్ల భూమి కొల్లగొట్టిన విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎన్నో సార్లు బతిమిలాడితే దానికి సహకరించలేదని బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ కోట్ల రూపాయల అక్రమస్తుల సంపాదించి రాష్ట్రాన్ని కొల్లగొట్టారన్నారు.

CM Revanth Reddy | వారిని జైలులో పెట్టాలి

కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా మార్చుకుందని సీఎం అన్నారు. అమిత్ షా కూడా ఇక్కడకు వచ్చి అదే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామన్నారు. ఇంతవరకు బీఆర్​ఎస్​ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెట్టిన తర్వాతే బీజేపీ సూచనలు చేయాలన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్​పై సీబీఐ విచారణకు సైతం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మైనింగ్​పై ఇప్పటికే సీఎం సీఐడీ విచారణకు ఆదేశించారు.

CM Revanth Reddy | బీఆర్​ఎస్​ సభ్యుల సస్పెన్షన్​

రాఘవ కన్​స్ట్రక్షన్​పై హౌజ్​ కమిటీ వేయాలని బీఆర్​ఎస్​ సభ్యులు డిమాండ్​ చేశారు. అలాగే సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ మేరకు స్పీకర్​ పొడియం ఎదుట ఆందోళన చేపట్టారు. స్పీకర్​ చెప్పినా వినకపోవడంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు స్పీకర్​ సస్పెండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం

Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
TAGGED:Assembly SessionBRSCM Revanth ReddyDalit RightsKCRpolitical controversyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kaushik Reddy controversy Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం
Next Article National Lok Adalat | National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​లో 5,662 కేసుల పరిష్కారం : సీపీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?