అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CMRF to Beneficiaries | ఆర్థిక ఇబ్బందులు పడుతూ వైద్యం పొందలేని వారికి సీఎంఆర్ఎఫ్ (CMRF) పథకం ద్వారా చెక్కులు అందించడం తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా చూస్తానన్నారు. దరఖాస్తు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా క్యాంపు కార్యాలయంలో తన బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను ఖచ్చితంగా సెక్రటేరియట్‌కు పంపుతామని చెప్పారు. దరఖాస్తు మొత్తంలో వీలైనంత ఎక్కువగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 85 మందికి రూ.56,20,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
CMRF to Beneficiaries | డబుల్ ఇళ్లు ఇవ్వలేదు
నాలుగేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు (Double Bed Room Houses) నియోజకవర్గంలో ఒకటి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నాగారంలో 396 ఇళ్లు, కలెక్టరేట్ సమీపంలో మరో 200 ఇళ్లు ఉన్నాయన్నారు. వీటిని నిర్మించి ఏళ్లు గడిచిందని వాటి కిటికీలు, తలుపులు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. ఈ విషయమై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని.. అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని పేర్కొన్నారు. అయినా వాటిని పేదలకు ఇవ్వడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, చింతకాయల రాజేందర్, ఇప్పకాయల కిశోర్, దాంపల్లి జ్యోతి మురళి, బొబ్బిలి సుమిత్ర వేణు, కలిపే అర్చన చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, నాయకులు బద్దంకిషన్, పుట్ట వీరేందర్ పాల్గొన్నారు.

దీనిని కూడా చదండి : BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం

