Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు

నిజామాబాద్

Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు

Shashi kiran mottala
Last updated: మార్చి 9, 2026 7:54 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Collector Ila Tripathi Inspection |
Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన... విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు

అక్షరటుడే, ఆర్మూర్/భీమ్​గల్​/బాల్కొండ: Collector Ila Tripathi Inspection | మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్​లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు.

Contents
  • Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ ప్రవర్తనపై ఆగ్రహం..
    • Collector Ila Tripathi Inspection | పరుష పదజాలంతో..
      • Collector Ila Tripathi Inspection | మైనారిటీ రెసిడెన్షియల్​ బాలికల విద్యాలయం..

Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ ప్రవర్తనపై ఆగ్రహం..

ఈ సందర్భంగా మోడల్ స్కూల్ (Telangana education department) కేర్ టేకర్ ఎం.వీణ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయి, పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ టేకర్ రెగ్యులర్​గా విధులకు హాజరు కారని, తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని వారు తెలిపారు. హాస్టల్​లో నీటికొరత తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని వారు వాపోయారు.

Collector Ila Tripathi Inspection | పరుష పదజాలంతో..

సదరు కేర్ టేకర్ తమను కూడా పరుష పదజాలాలతో దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మోడల్ స్కూల్ (Model school inspection) సిబ్బంది సైతం కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా (Armoor News) పరిగణించిన కలెక్టర్, మోడల్ స్కూల్ కేర్ టేకర్ వీణ తీరుపై తక్షణ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఈసీవో భాగ్యలక్ష్మి, ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్​ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్ వీణను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్​లో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

Collector Ila Tripathi Inspection | మైనారిటీ రెసిడెన్షియల్​ బాలికల విద్యాలయం..

అంతకుముందు కలెక్టర్ మైనారిటీ రెసిడెన్షియల్ (Minority residential school) బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. పదోతరగతి గదిని సందర్శించి, విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి, వారి అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేశారు. సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందిస్తూ, చాక్లెట్ బాక్సులు అందజేశారు. పరీక్షలు సమీపించినందున ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని, కేవలం పాస్ మార్కులు కాకుండా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని స్ఫూర్తి కలిగించారు. గతేడాది 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపాల్ తెలుపగా, ఈసారి కూడా వందశాతం ఫలితాలు వచ్చేలా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని ఆదేశించారు.

taching2

ఇది కూడా చదవండి: ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..
Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : ఎమ్మెల్యే ధన్​పాల్​
Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
TAGGED:Armoor NewsCollector Ila TripathiIla TripathiSchool administrationTelangana collector inspection
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Industrial Development Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​
Next Article LPG Booking Interval LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?