Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి

అంతర్జాతీయం

Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి

కొలంబియాలో 110 మంది సైనికులతో వెళ్తున్న సి-130 హెర్క్యులస్ విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. 80మందికి పైగా మృతి చెందినట్లు భావిస్తున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 8:46 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Colombia Plane Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Colombia Plane Crash | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా (Colombia)లోఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం టేకాఫ్ సమయంలోనే కుప్పకూలింది.

Contents
  • Colombia Plane Crash | కార‌ణాలు తెలియాల్సి ఉంది..
    • Colombia Plane Crash | మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా

ప్యూర్టో లెగుయిజామో సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు.. పెరూ సరిహద్దుకు సమీపంలో ప్ట్యూర్టో లెగుయిజామో (Leguizamo) పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం సి-130 హెర్క్యులస్గా గుర్తించారు. ఇది పెరూ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన సైనిక బలగాలకు సహాయం అందించేందుకు బయలుదేరింది.

Colombia Plane Crash | కార‌ణాలు తెలియాల్సి ఉంది..

టేకాఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాలకే, నగరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ ప్రమాదంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ (Pedro Sánchez) తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 20 మంది గాయపడిన సైనికులను రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించారు. మిగతా వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం  కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారినట్లు సమాచారం.

Colombia Plane Crash | మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా

ఈ ఘటనపై అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో  ఈ ప్రమాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ విషాద ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఆశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది” అని తెలిపారు.అదే సమయంలో, సైనిక రంగంలో ఆధునీకరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూడా చదవండి..: Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు

Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Bahrain US Fleet | బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ఫ్లీట్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి?
TAGGED:aviation disasterC130 Hercules crashColombia newscolombia plane crashDefence Ministrydefense newsLeguizamomilitary aircraft accidentPedro Sánchezplane crash soldiersSouth America news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article GHMC Property Tax Dues GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?