Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు

జాతీయం

Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో, దేశంలో కమర్షియల్ LPG సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 9:46 ఉద.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Commercial LPG Price Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Commercial LPG Price Hike | పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరా దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్ర‌భుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price)ను మరోసారి పెంచుతూ సామాన్యులకు షాక్ ఇచ్చాయి.

Contents
  • Commercial LPG Price Hike | గృహ వినియోగ సిలిండర్ ధరలు స్థిరం
    • Commercial LPG Price Hike | ఎల్పీజీ ధరలపై ప్రభావం

తాజా సవరణలో భాగంగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 195.50 పెంచారు.ఈ పెంపుతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,000 మార్క్‌ను దాటింది. దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో 19 కిలోల సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. గత నెల మార్చి 1న కూడా రూ. 114.50 మేర పెంపు చేసిన విషయం తెలిసిందే. వరుసగా పెరుగుతున్న ధరలు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Commercial LPG Price Hike | గృహ వినియోగ సిలిండర్ ధరలు స్థిరం

ఇక గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ప్రస్తుతం మార్పులు లేవు. మార్చి 7న రూ. 60 పెంచిన తర్వాత, ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 913గా ఉంది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్, భార‌త్ పెట్రోలియం (Bharat Petroleum),హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petroleum) ప్రతి నెలా ఒకటో తేదీన LPG, ATF ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి మారకపు విలువ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటారు.

Commercial LPG Price Hike | ఎల్పీజీ ధరలపై ప్రభావం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ (Global Market)లో చమురు ధరలు సుమారు 50% వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల ప్రత్యక్షంగా ఎల్పీజీ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల  కొరత కూడా ఉండటం వ్యాపారులకు మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. ధరలు పెరగడం, సరఫరా తగ్గడం కలిసి చిన్న వ్యాపారాలపై భారాన్ని పెంచుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశంలో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి..: Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​

Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..
Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
TAGGED:Bharat PetroleumCommercial LPG Cylinder PriceCommercial LPG Price HikeGlobal MarketHindustan PetroleumNew Delhi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా! India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
Next Article Russia Plane Crash Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?