అక్షరటుడే, కామారెడ్డి: Complaint Boxes Controversy | నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు (complaint boxes issue) చట్ట విరుద్ధమని టీపీసీసీ (TPCC news) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrashekhar Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్‌ను (Kamareddy politics) కలిసి వినతిపత్రం అందజేశారు.
Complaint Boxes Controversy | నేరుగా కలిసే అవకాశం లేకుండా..
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేను నేరుగా కలవకుండా ఫిర్యాదులను పెట్టెల ద్వారా సమర్పించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. సమస్యలను నేరుగా తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు అని, ఫిర్యాదుల పెట్టె వంటి మధ్యవర్తిత్వ వ్యవస్థను ప్రవేశపెట్టడం (public complaints system) పారదర్శకత, జవాబుదారీ తనాన్ని, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని(political news India) తగ్గిస్తుందన్నారు. అంతే కాకుండా ఫిర్యాదుల పెట్టెలు అధికారిక తపాలా పెట్టెలను పోలి ఉన్నాయని గుర్తు చేశారు. ఫిర్యాదుల పెట్టెల వ్యవస్థల చట్టభద్రతలను పరిపాలన ఆమోదాలను పరిశీలించాలని, ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన పెట్టెలను తక్షణమే తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
