అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ/భీమ్‌గల్: Comrade Rayala Ravanna | విప్లవ పంథా కోసం తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప యోధుడు కామ్రేడ్ రాయల రవన్న (సుభాష్ చంద్రబోస్) అని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజా పంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ కొనియాడారు. గురువారం మండలంలోని గడ్కోల్ గ్రామం (Gadkol village)లో రాయల రవన్న 10వ వర్ధంతి సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. రవన్న 40ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి, విప్లవకారుల ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు.

Comrade Rayala Ravanna | సమకాలీన పరిస్థితుల్లో..
సమకాలీన పరిస్థితుల్లో ప్రజా పంథాను మరింత బలోపేతం చేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని ప్రభాకర్ పేర్కొన్నారు. పిడివాద ధోరణులను ఎండగడుతూ బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి విప్లవ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని (Hyderabad) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న 10వ వర్ధంతి సభకు ఉమ్మడి జిల్లా నుంచి విప్లవ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్.రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, కిశోర్, అనీస్, సాయిరెడ్డి, మండల నాయకులు లింబాద్రి, నారగౌడ్, రమేష్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ

