అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Congress Committee Formation | కాంగ్రెస్ (Congress) జిల్లా కమిటీని పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాతోపాటు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీని సైతం నియమించారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డితో చర్చించి కమిటీ ఏర్పాటు చేసినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా.. ఎం వెంకట్‌రెడ్డి, గ్యాదరి గోపి, చాట్ల నరేశ్, ఎలాల శ్రీనివాస్, మేక వీర్రాజు, వేంపల్లి రత్నాకర్ గౌడ్, మోహినుద్దీన్ పాషా, రజిత యాదవ్, కూరపాటి గంగాధర్, తారాచంద్ నాయక్, ఆర్మూర్ చిన్న బాలరాజు, కౌడప్ శరత్ కుమార్ నియమితులయ్యారు.
Congress Committee Formation | జనరల్ సెక్రెటరీలుగా..
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా.. ప్రవీణ్ కుమార్ గౌడ్, మీర్ మాజిద్, పస్క నర్సయ్య, గోపాల్ నగేశ్, గంగారెడ్డి, మగ్గిడి ముత్యం రెడ్డి, సోం రాజేందర్, ఏలేటి మోహన్, ఆడెం గంగాప్రసాద్, కర్కె అశోక్, గందపు పవన్, అరవింద్ రెడ్డి, ఆనంపల్లి ఎల్లయ్య, గోవర్ధన్ రెడ్డి, రామ్ మోహన్‌ను నియమిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Congress Committee Formation | నగర కాంగ్రెస్ కమిటీ
నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) కాంగ్రెస్ కమిటీని పీసీసీ చీఫ్ నియమించారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతరెడ్డి విజయ్‌పాల్ రెడ్డి, సయ్యద్ సలీం, కోర్వ రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లెల రమేష్, కస్తూరి గంగరాజు, ధర్మారం అవీన్, సర్దార్ నరేందర్ సింగ్, సయ్యద్ హర్షద్, బాత్నతే శంకర్, కుంచెపు నగేష్ నియమితులయ్యారు. కోశాధికారిగా సకినాల శివప్రసాద్, అధికార ప్రతినిధులుగా మల్యాల గోవర్ధన్, మొహమ్మద్ జియా అహ్మద్, కార్యదర్శులుగా మంతెన సంపత్, పత్తి శోభన్ కుమార్, గజింగ్ ప్రవీణ్, డండోట్కర్ వినోద్, షేక్ అఫ్సర్, ఆకుల వెంకటేష్ (రాజు), సడక్ శేఖర్ రెడ్డి, ఉప్పరి స్వప్న ,పడకంటి సంతోష్, స్వప్న మడుపు, బీఎల్ గోవింద రాజులు, దుడ్డు సందీప్, మీనా శర్మ, మొహమ్మెద్ అయూబ్‌ను నియమించారు.

దీనిని కూడా చదవండి : Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి

