అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress Leader Murder Case | కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి గోపి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఇందల్వాయి మండలం గౌరారం శివారులో హత్యకు గురయ్యాడు. కారును ఢీకొట్టి .. అనంతరం కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ప్రధాన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. అయితే ఈ కేసులో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Congress Leader Murder Case | పథకం ప్రకారమే హత్య
ఇమ్మడి గోపి హత్య పథకం ప్రకారమే జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు ఆరోపించారు. గోపిని హతమార్చేందుకు నిందితుడు సతీష్‌తో పాటు మరికొందరు కొద్దిరోజులుగా ప్లాన్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నాడనే కక్షతోనే దారుణంగా హత్య చేశారని వారు ఆరోపించారు. కాగా.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల అనంతరం కక్షలు పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుడి భార్య సైతం పలువురు అనుమానితుల పేర్లు చెప్పినట్లుగా సమాచారం.

Congress Leader Murder Case | కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఇమ్మడి గోపి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టబోమన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా.. ఇమ్మడి గోపి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Congress Leader Murder | నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

