అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Leader Ramakrishna | బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు కిరాయి మూకలతో దాడులకు పాల్పడడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili ramakrishna) వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Congress Leader Ramakrishna | 8వ డివిజన్లో..
8వ డివిజన్లో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ కార్పొరేటర్‌పై కేసు నమోదైన విషయం మరవక ముందే అదే డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున కార్పొరేటర్ (Municipal Elections) అభ్యర్థిగా నిలబడిన జిల్లాల రమేశ్‌పై శుక్రవారం దాడి జరిగిందన్నారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే, వాటికి సమాధానం చెప్పలేక భయపడి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాల రమేష్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో నిజానిజాలను బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీస్‌శాఖను (Nizamabad Police) కోరారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
