అక్షరటుడే, లింగంపేట : Congress Policies Criticism | కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ (BJP State Committee) పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టు చేయించి ప్రభుత్వం ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తోందన్నారు. లేకపోతే ప్రజలకు న్యాయం చేయమని పోరాటం చేసేవారిని ఈ విధంగా ముందుగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానం కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసపూరితంగా మభ్యపెడుతుందని ఆరోపించారు.
Congress Policies Criticism | హామీలను నెరవేర్చాలి..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసపూరిత హామీలు ఇచ్చిందని క్రాంతికుమార్ అన్నారు. వాటిని అమలు చేయలేక ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిందలు మోపుతోందన్నారు. బడ్జెట్లోనూ రైతులు, గల్ఫ్ కార్మికులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. హామీల అమలు కోసం నినదిస్తే బీజేపీ నాయకులను బైండోవర్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచందర్ చారి, బూత్ అధ్యక్షులు మల్లు గణేష్, పట్టణ అధ్యక్షుడు నరేష్ భగవాన్, బూత్ అధ్యక్షుడు రాజారాం రమేష్ తదితరులు ఉన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని వదిలిపెట్టినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా

