Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!

తెలంగాణకరీంనగర్తాజా వార్తలునిజామాబాద్

Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!

కాంగ్రెస్​ పార్టీలో తన ఉనికిని చాటుకుంటూనే, నాయకత్వ పోకడలపై మాజీ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్​ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. బతకడానికి వచ్చిన వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని తీవ్రంగా ఆక్షేపించారు.

Naresh chandan
Last updated: మార్చి 25, 2026 11:22 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Congress Senior Leaders | కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Contents
  • Congress Senior Leaders | పోచారం ఇచ్చిన సలహాలు ఏమిటి?
    • Congress Senior Leaders | రాహుల్ ఆశయాలకు విరుద్ధం
      • చిన్నారెడ్డికి అవమానం
      • వేం నరేందర్​ రెడ్డి పెత్తనం
      • నియంతలా..

Congress Senior Leaders | పోచారం ఇచ్చిన సలహాలు ఏమిటి?

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై జీవన్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు గత 20 నెలలుగా ప్రభుత్వానికి పోచారం ఇచ్చిన సలహాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఏమిటని నిలదీశారు.

Congress Senior Leaders | రాహుల్ ఆశయాలకు విరుద్ధం

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని పార్టీలో అణగదొక్కుతున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేవలం “జీ హుజూర్” అనే వారికే పదవులు దక్కుతున్నాయని ఘాటుగా విమర్శించారు.

చిన్నారెడ్డికి అవమానం

సీనియర్ నాయకుడు చిన్నారెడ్డికి జరిగిన అన్యాయాన్ని జీవన్​రెడ్డి ప్రస్తావించారు. వనపర్తి టికెట్ విషయంలో ఆయనను మోసం చేశారని ఆరోపించారు. ఆ అవమానంతో చిన్నారెడ్డి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పడం కాంగ్రెస్​ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వేం నరేందర్​ రెడ్డి పెత్తనం

రాష్ట్ర ప్రభుత్వంలో వేం నరేందర్​ రెడ్డి సలహాలకు ఉన్న ప్రాధాన్యం సీనియర్లకు లేదని జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు. వి. హనుమంతరావు, మధు యాష్కీ, వంశీచంద్ రెడ్డి వంటి సీనియర్లను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నియంతలా..

“కాంగ్రెస్​ పార్టీ నాది.. అడ్డు వచ్చేవారిని తొక్కుతా..” అనే ధోరణిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల గడ్డపై తనను ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Telangana Thunderstorm Alert | పగలు భానుడి భగభగ.. రాత్రి ఉరుములు, మెరుపులు.. ఆ ప్రాంతాల్లో అలెర్ట్​!
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
TAGGED:congress internal issuescongress leadersIndian Politics NewsJeevan Reddyparty leadershippolitical controversysenior leaders debateTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Adoor Congress Campaign | కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అడూర్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Next Article March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే! March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?