అక్షరటుడే, కామారెడ్డి: Country Bomb Incident | నాటుబాంబు పేలి గేదెకు గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ (kamareddy news) మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది.
Country Bomb Incident | పందుల కోసం పెట్టిన బాంబు..
బాధితుడి కథనం ప్రకారం.. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ తన గేదెను తీసుకుని జాతీయ రహదారి పక్కన దేవివిహార్ వైపు మేతకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు గేదెను కట్టేయగా అక్కడే పందుల కోసం తవుడులో కలిపి పెట్టిన పూసల నాటు బాంబును (illegal explosives india) గేదె తినడంతో వెంటనే అది పేలింది. దీంతో గేదె దవడ పూర్తిగా (animal injury case) చీలిపోయింది. ఈ ఘటనలో గేదె దవడ భాగాలు విడిపోయాయి.
Country Bomb Incident | పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మిగిలి ఉన్న పూసల బాంబులను పోలీస్ స్టేషన్కు (police investigation) తరలించారు. గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పూసల బాంబులు ఎవరు తెచ్చారు. ఎందుకు అక్కడ పడేశారనే కోణంలో(Sadashivnagar Police) పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే నాటు బాంబులు పందుల కోసమే తెచ్చారా.. లేక బండరాళ్లను (explosion incident) పేల్చేందుకు తెచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

