Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు

క్రైంనిజామాబాద్

Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు

అదనపు ఆదాయం కోసం భార్యాభర్తలు అడ్డదారి తొక్కారు. చెత్త కాగితాలు, వాటర్ బాటిళ్లు ఏరుకుంటై ఒకరు.. స్క్రాప్ కొనుగోలు చేస్తామంటూ మరొకరు చోరీలకు తెగబడ్డారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 11, 2026 9:30 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Couple Theft Arrest |
Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు

అక్షరటుడే, కామారెడ్డి : Couple Theft Arrest | అదనపు ఆదాయం కోసం భార్యాభర్తలు(Couple Theft Arrest) అడ్డదారి తొక్కారు. చెత్త కాగితాలు, వాటర్ బాటిళ్లు ఏరుకుంటూ ఒకరు.. స్క్రాప్ కొనుగోలు చేస్తామంటూ మరొకరు చోరీలకు తెగబడ్డారు. ఇలా చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలకు కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) చెక్ పెట్టారు.

Contents
  • Couple Theft Arrest | భిక్కనూరు పోలీస్​స్టేషన్​లో..
    • Couple Theft Arrest | తాళం వేసిన ఇళ్లు టార్గెట్​..

Couple Theft Arrest | భిక్కనూరు పోలీస్​స్టేషన్​లో..

భిక్కనూరు పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి (Kamareddy) సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న భిక్కనూరు (Bhiknoor Theft Cas) మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో రెండు తులాల వెండి పట్టగొలుసులు, రూ.10 వేలు నగదు చోరీ జరిగింది,

భిక్కనూరు వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 8న తాళం పగులగొట్టి హుండీలో ఉన్న సుమారు రూ.వెయ్యి ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాల కేసులలో పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం బీటీఎస్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. లంబాడీ శ్రావణి అనే మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తన భర్త శ్రీనివాస్​తో కలిసి అదనపు ఆదాయం కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్నట్టు చెప్పుకొచ్చింది.

Couple Theft Arrest | తాళం వేసిన ఇళ్లు టార్గెట్​..

తాళం వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి, క్షణాల్లో తాళం పగుల గొట్టి చోరీకి పాల్పడుతున్నట్టుగా పోలీసుల (Local Crime Report) విచారణలో తేలింది. గత (ఫిబ్రవరి) నెలలో మాధిమానిక్ గ్రామంలో 4 తులాల బంగారం దొంగిలించారు. ఈ సొత్తును నర్సాపూర్​కు చెందిన వ్యాపారి పర్థం ఏలియా అలియాస్ ప్రవీణ్ వద్ద విక్రయించారు. ఇలా వచ్చిన రూ.1.70 లక్షలతో విలాసాల కోసం బైక్ కొనుగోలు చేశారు.

ఈ మేరకు వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి భర్త పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ (Telangana Crime News) తెలిపారు. శ్రావణి, వ్యాపారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు తులాల వెండి పట్టీలు, ఒక ఫోన్​, రెండు బైక్​, పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్​ను త్వరలోనే (Police Investigation India) పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.

 ఇది కూడా చదవండి: Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చొద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి

Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:Bhiknoor Theft CaseCouple Theft ArrestHouse Burglary CaseKamareddy Policelocal crime reportpolice investigation indiaTelangana Crime NewsTemple Theft Incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gas Booking Cyber Scam Gas Booking Cyber Scam | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్​ మోసాలు
Next Article Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి 'ప్రొబయోటిక్స్'.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?