అక్షరటుడే, ఇందూరు : Cow Protection Movement | జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Cow Protection Movement | అహింసా మార్గంలో..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కోసం ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశదేవతగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసుకురావాలన్నారు. వీటిని సాధించేందుకు ఈనెల 27న జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గో సమ్మాన్ అభియాన్ ప్రతినిధులు అనిల్ గోపాల్, కుషాల్ దాస్, భూపాల్ సింగ్, వీహెచ్పీ గోరక్ష విభాగం తెలంగాణ (Telangana) ప్రాంత కృషి ప్రముఖ్ ధాత్రిక రమేష్, ఇందూరు గో సేవా సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేష్, లక్ష్మీకాంతం, యాదగిరి, రజినీకాంత్, వెంకటరమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి..: సీపీ సాయిచైతన్య
