అక్షరటుడే, కామారెడ్డి: CPD Committee Member | తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లోని (Telangana Medical Council) కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీపీడీ) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యుడిగా కామారెడ్డికి (Kamareddy) చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అరవింద్ గౌడ్‌ను నియమించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి చేశారు.
CPD Committee Member | ఐదు క్రెడిట్ పాయింట్లు..
ఈ క్రమంలో ప్రతి వైద్యుడు ఏటా 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన సీపీడీ కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కమిటీ ద్వారా ప్రొఫెషనల్ సంస్థలు, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కూడా ఈ కమిటీ దృష్టి సారిస్తోంది. అలాంటి కమిటీలో సభ్యుడిగా కామారెడ్డి జిల్లాకు అవకాశం రావడం హర్షణీయమని వైద్యులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
