Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!

జాతీయం

Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!

క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా ఖర్చు చేస్తామంటే కుదరదిక.. ఇకపై మన ట్రాన్జాక్షన్స్ పై ఐటీ శాఖ కన్నేసి ఉంచనుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 11:13 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Credit Card IT Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Card IT Rules | క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని చాలా మంది అడ్డగోలుగా ఖర్చు చేస్తుంటారు. షాపింగ్ కోసం, బిల్లుల చెల్లింపుల కోసం తరచుగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. కొంత మంది రివార్డ్ పాయింట్ల కోసం పూర్తి లిమిట్ ను వాడేస్తుంటారు. ఇంకొందరు క్రెడిట్ కార్డునుంచి మనీ ట్రాన్స్ ఫర్ (Money Transfer) చేయించుకుని అప్పులు కట్టేసుకుంటుంటారు. అయితే ఇకపై ఇష్టమొచ్చినట్లుగా క్రెడిట్ కార్డును వినియోగిస్తే కుదరదు.

Contents
  • Credit Card IT Rules | లెక్క చెప్పాల్సిందే
    • Credit Card IT Rules | నోటీసులు వచ్చే అవకాశం
      • Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్..
      • Credit Card IT Rules | ఆ కార్డ్ ఆఫీస్ అవసరాలకు మాత్రమే..
        • ఆదాయపు పన్నూ చెల్లించొచ్చు
        • అడ్రస్ ప్రూఫ్‌గానూ పనిచేస్తుంది

క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడడం అంటే.. ఇంటికి ఇన్‌కం ట్యాక్స్ వాళ్లను ఆహ్వానించడమే అవుతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి నిబంధనలు మారాయి. ఇవి ఈనెల ఒకటో తేదీనుంచే అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఐటీ శాఖ (IT Department) మీ క్రెడిట్ కార్డ్ వినియోగం, ఖర్చులపై ఓ కన్నేసి ఉంచనుంది. మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు ఇకపై లెక్కలోకి రానుందన్న మాట. కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకుందామా..

Credit Card IT Rules | లెక్క చెప్పాల్సిందే

ఒక ఆర్థిక సంవత్సరంలో మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు ఈ సమాచారాన్ని నేరుగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)కు నివేదించనున్నాయి. కేవలం దేశీయ ఖర్చులే కాకుండా, అంతర్జాతీయ ప్రయాణాల కోసం చేసే ఖర్చులు కూడా పరిశీలనలో ఉండనున్నాయి.

Credit Card IT Rules | నోటీసులు వచ్చే అవకాశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకుల దృష్టిలో క్రెడిట్ కార్డ్ అనేది వినియోగం కోసం మాత్రమే.. పెట్టుబడుల కోసం కాదు. అందుకే ఇష్టారీతిన క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కొత్త తలనొప్పులు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులలో ప్రకటించిన ఆదాయం కంటే వార్షిక క్రెడిట్ కార్డ్ ఖర్చులు గణనీయంగా ఎక్కువగా ఉంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. దీని గురించి ఆదాయపు పన్ను శాఖ ఆరా తీస్తుంది ఖర్చులకు, ఆదాయానికి పొంతన లేని పక్షంలో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.

Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్..

క్రెడిట్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లను అనుసంధానించే నిబంధనలు కఠినతరం కానున్నాయి. చెల్లుబాటు అయ్యే పాన్ నంబర్ లేకుండా ఏ బ్యాంక్ కూడా కొత్త క్రెడిట్ కార్డును జారీ చేయదు. ఇప్పటికే కార్డులు కలిగి ఉన్న వారు కూడా తమ కార్డులను పాన్ నంబర్‌ (PAN Number)తో లింక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు చేసే ప్రతి ఖర్చు మీ పన్ను ప్రొఫైల్‌తో ముడిపడి ఉంటుంది. పారదర్శకతను పెంచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Credit Card IT Rules | ఆ కార్డ్ ఆఫీస్ అవసరాలకు మాత్రమే..

చాలా మంది ఉద్యోగులకు వారి కంపెనీల నుంచి కార్పొరేట్ క్రెడిట్ కార్డులు (Credit Cards) లభిస్తాయి. చాలామంది ఈ కార్డులను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇకపై అలా చేస్తే కుదరదు. కంపెనీ ఇచ్చిన కార్డును వ్యక్తిగత షాపింగ్, మూవీ టిÂకెట్లు లేదా వ్యక్తిగత పర్యటనల కోసం ఉపయోగిస్తే ఆ ఖర్చును ప్రభుత్వం మీ అదనపు ఆదాయంగా పరిగణిస్తుంది. ఆ మొత్తంపైనా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్నూ చెల్లించొచ్చు

నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ వాడే ఇబ్బంది లేకుండా ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఆదాయపు పన్ను చెల్లించవచ్చు. పన్నులు చెల్లించే సమయంలో మీ దగ్గర నగదు కొరత ఉంటే కార్డుతో పేమెంట్ చేసి, ఆ తర్వాత బ్యాంకుకు ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉంది.

అడ్రస్ ప్రూఫ్‌గానూ పనిచేస్తుంది

ఇకపై క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ కూడా అడ్రస్ ప్రూఫ్‌గా పనికివస్తుంది. మీ వద్ద విద్యుత్ బిల్లు (Electricity Bill) లేదా ఇతర ప్రామాణిక నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుందన్న మాట. కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకున్నా తాజా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు.

ఇది కూడా చదవండి..: Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి

 

Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి
Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
TAGGED:Credit Card IT RulesCredit CardsElectricity BillIncome Tax DepartmentIT DepartmentMoney TransferPAN Number
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Car Fell Into Well Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి
Next Article Iran Downs US Jets Iran Downs US Jets | అమెరికా యుద్ధ విమానాలు కూల్చి వేసిన ఇరాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?