అక్షరటుడే, కామారెడ్డి: Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి పూర్తి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పొలీస్(SP Rajesh chandra) అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన దొంగతనాలు, దోపిడీలు, రాబరీ నేరాలకు సంబంధించిన గ్యాంగ్ ఫైల్స్‌పై (crime control) సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
Criminal Profile Preparation | అంతర్రాష్ట్ర ముఠాలు..
జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల నేర ప్రవర్తన, సాక్ష్యాధారాల సేకరణ వివరాల (investigation process) గురించి ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడటమే లక్ష్యంగా (law enforcement) పెండింగు కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సూచించారు.
కోర్టులో నిందితుల నేరాన్ని నిరూపించేలా శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాధారాలను (kamareddy police) పకడ్బందీగా సేకరించి త్వరితగతిన అభియోగపత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ప్రతి కేసులో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.
Criminal Profile Preparation | జిల్లాలో నేరాల నియంత్రణకు..
జిల్లాలో నేరాల నియంత్రణకు ఆపరేషన్ కవచ్‌ను మరింత బలోపేతం(crime prevention) చేయాలని నిర్ణయించారు. సబ్ డివిజన్ అధికారులు, సీఐలతో (policing strategy) చర్చించి రాత్రి గస్తీలను ముమ్మరం చేయడం, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంపై సూచనలు చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, రైటర్లు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Olympiad Education Benefits | ఒలంపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..

