అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices Drop | పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో రెండు వారాల పాటు కాల్పులు విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. సీజ్ ఫైర్ కాలంలో హార్మూజ్‌ను (Strait of Hormuz) తెరిచేందుకు ఇరాన్ కూడా ఒప్పుకుంది.
ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తెలిపారు. ఈ నిర్ణయంతో ముడి చమురు ధరలు 15 శాతానికిపైగా పతనమయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ లాభాల దిశగా సాగుతున్నాయి.
Crude Oil Prices Drop | భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్..
ఇరాన్ – అమెరికాల మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అమెరికా (America) భీకర దాడులు, ఇరాన్ దీటైన ప్రతిస్పందనతో పశ్చిమాసియా అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. ప్రపంచ సరుకు రవాణాకు కీలకమైన ఈ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లలోపు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర.. గరిష్టంగా 120 డాలర్లను దాటింది. క్రితం సెషన్లలో 111 డాలర్ల వద్ద ఉంది.
Crude Oil Prices Drop | అనూహ్యంగా కాల్పుల విరమణ..
హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ నాగరికతను అంతం చేస్తామంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump) చేసిన హెచ్చరికలతో కొంత ఆందోళన కనిపించింది. దీనికి మంగళవారం రాత్రిని తుది గడువుగా నిర్ణయించింది. అయితే అనూహ్యంగా గడువు ముగిసే సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్ సైతం హార్మూజ్ నుంచి నౌకల రవాణాకు అంగీకరించింది. సీజ్ ఫైర్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధర దిగివచ్చింది. గరిష్ఠాల నుంచి భారీగా పడిపోయింది. బుధవారం ఉదయం బ్యారెల్ ధర 95 డాలర్ల దిగువ ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి..: Gold Silver Rates Today | మరింత తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..!
