Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ

తెలంగాణ

CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ

సీఎస్ పదవీ కాలం పొడిగింపుపై రిటైర్డ్​ ఐపీఎస్​ నాగేశ్వర్​రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 6:49 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
CS Tenure Extension

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CS Tenure Extension | రాష్ట్ర ప్రభుత్వం సీఎస్​ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) పదవీకాలన్ని మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. ఆయన సర్వీస్​ను రెండో సారి పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్​ అధికారి ఎం నాగేశ్వర్​ రావు (Nageswar Rao), సీబీఐ (CBI) మాజీ డైరెక్టర్​ సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.

Contents
  • CS Tenure Extension | చాలా మంది ఉంటారు
    • CS Tenure Extension | అసాధారణ పరిస్థితుల్లో..

అధికారుల పదవీ కాలం పొడిగింపుపై నాగేశ్వర్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సివిల్ సర్వెంట్ అధికారి పదవి విరమణకు ముందే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆశయమే అన్ని సర్వీసులలోని (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్, రాష్ట్ర కేడర్‌లు) అధికారులను వారి కెరీర్ మొత్తంలో నిలకడగా పనిచేయడానికి, నిజాయితీని పాటించడానికి ప్రేరేపిస్తుందన్నారు. అయితే పదవీ విరమణ వయస్సు దాటి ఇచ్చే పొడిగింపులు ఈ పురోగతికి ఆటంకం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

CS Tenure Extension | చాలా మంది ఉంటారు

పదవీకాలం పొడిగింపులు (Term Extensions) కొందరు వ్యక్తులు తప్పనిసరి అనే భావనను పెంపొందిస్తాయని తెలిపారు. సక్రమంగా పనిచేసే వ్యవస్థలో, ఏ ఒక్క అధికారి కూడా తప్పనిసరి కాదన్నారు. అదే సామర్థ్యంతో విధులు నిర్వహించడానికి చాలామంది ఎల్లప్పుడూ ఉంటారన్నారు. తనకు కె. రామకృష్ణారావుతో వ్యక్తిగత పరిచయం లేదన్నారు. ఆయన సామర్థ్యం, నిజాయితీని అనుమానించడం తన ఉద్దేశం కాదని చెప్పారు. అయితే తెలంగాణ కేడర్‌లో ముఖ్య కార్యదర్శి పదవికి సామర్థ్యం, అర్హత కలిగిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారని తెలిపారు. ఒక పొడిగింపు కోసం వారిని విస్మరించడం ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులలో అసంతృప్తిని పెంచే ప్రమాదం ఉందని తెలిపారు.

CS Tenure Extension | అసాధారణ పరిస్థితుల్లో..

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అధికారుల పదవీ కాలం పొడగించాలని నాగేశ్వర్​రావు కోరారు. అత్యవసర పరిస్థితులు, జాతీయ భద్రతా అవసరాలు, తగిన ప్రత్యామ్నాయం లేని సందర్భాల్లో మాత్రమే అధికారుల సర్వీస్​ పొడిగించాలన్నారు. దీంతో అధికారుల్లో ప్రతిభ ఆధారిత పురోగతి, కెరీర్ అభివృద్ధిపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

ramakrishna rao

దీనిని కూడా చదవండి : Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..

SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
TAGGED:civil services extensionCS Tenure Extensiongovernment orders IndiaIAS IPS service rulesretired IPS letterTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Committee Formation Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
Next Article Egypt Fuel Crisis Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?