అక్షరటుడే, వెబ్‌డెస్క్: CV Anand DGP | తెలంగాణ కొత్త డీజీపీ (Telangana New DGP)గా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. ఈ నెల 14న అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం డీజీపీగా శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) కొనసాగుతున్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం గతంలోనే కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు యూపీఎస్సీకి నలుగురి పేర్లను పంపింది. అందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లను యూపీఎస్సీ పంపించింది. వీరిలో ఒకరు డీజీపీ కానున్నారు.
CV Anand DGP | సీనియర్ కావడంతో..
ముగ్గురిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం డీజీపీగా నియమించనున్నట్లు తెలిసింది. ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2028 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. దీంతో ఆయన డీజీపీగా బాధ్యతలు చేపడితే రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది.
సీవీ ఆనంద్ రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)లో జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. 1991లో ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఆనంద్ 1993లో వరంగల్ రూరల్ అడిషనల్ ఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ ఎస్పీగా పని చేశారు. నక్సల్స్‌కు వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో హైదరాబాద్ సీపీగా పని చేసి ఆయన ఇటీవల హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
ఇది కూడా చదవండి..: Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య
