Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ సిబ్బంది పాత్ర కీలకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ సిబ్బంది పాత్ర కీలకం

తెలంగాణతాజా వార్తలు

Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ సిబ్బంది పాత్ర కీలకం

సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ అన్నారు

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Cyber Crime Control

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణలో బ్యాంక్​ ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్​ (Hyderabad) సీపీ సజ్జనార్​  అన్నారు. సైబర్​ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

Contents
  • Cyber Crime Control | అప్రమత్తం చేయాలి
    • Cyber Crime Control | పోలీసులకు ఫిర్యాదు చేయాలి

రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్​ నేరాలు (Cyber Crimes) పెరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. పలువురు మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్​మెంట్​ ఫ్రాడ్​ విషయంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోయి కొందరు సైబర్​ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్​ (CP Sajjanar) కీలక సూచనలు చేశారు.

Cyber Crime Control | అప్రమత్తం చేయాలి

ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని సీపీ అన్నారు. వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు.ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్లు తమ డిపాజిట్లను హుటాహుటిన విత్‌డ్రా చేయడం, బంగారంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని చెప్పారు. అటువంటి సమయాల్లో వారి ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు, ఆందోళన కనిపిస్తే అది సైబర్ ముఠాల పనేమోనని ఆరా తీయాలన్నారు.

Cyber Crime Control | పోలీసులకు ఫిర్యాదు చేయాలి

వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను మోసగాళ్ల మాయలో పడి పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు, 1930 నంబర్‌కు, డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాగా ఇటీవల పలువురు బ్యాంక్​ సిబ్బంది సైతం సైబర్​ నేరగాళ్లకు సహకరిస్తూ పోలీసులకు చిక్కారు. కస్లమర్లకు రక్షణగా ఉండాల్సిన ఉద్యోగులు సైబర్​ దొంగలతో కలిసి ప్రజల ఖాతాలను లూఠీ చేశారు. మ్యూల్​ ఖాతాలు తెరవడం, డబ్బు బదలాయింపులో సహకరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: GHMC Property Seizure | హైదరాబాద్​లో మాజీ సీఎం ఇల్లు సీజ్​

Feeding Centers | బాలింతలకు గుడ్​న్యూస్​.. బస్టాండ్​లలో ఫీడింగ్​ సెంటర్లు ప్రారంభం
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి
March 31 Horoscope | ఒత్తిడి, అలసట, కష్టాలు ఇక దూరం.. ఈ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి!
Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం!
TAGGED:bank staff rolebanking security tipsCP SajjanarCyber Crime ControlCyber Crimescyber fraud awarenessdigital arrest scamsfinancial fraud alertsHyderabadinvestment fraud preventiononline scams india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article GHMC Property Seizure  GHMC Property Seizure | హైదరాబాద్​లో మాజీ సీఎం ఇల్లు సీజ్​
Next Article Nizamabad Bike Accident Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?