Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు

పోలీసింగ్‌ వ్యవస్థ అనేది కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు మనుషులకు తోడుగా నిలబడటమూ బాధ్యతేనని హైదరాబాద్​లోని మాదాపూర్​లో జరిగిన సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 8, 2026 9:11 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు

అక్షరటుడే, హైదరాబాద్​: Cyberabad Traffic Kindness | విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మనసులో మానవత్వం ఎంత గొప్పదో చూపించే సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బాధలో ఉన్న ఓ వ్యక్తికి సహాయం చేసి అతనికి ఆత్మగౌరవం తిరిగి కలిగేలా చేసిన ట్రాఫిక్ పోలీసుల చర్య ప్రశంసలు అందుకుంటోంది.

Cyberabad Traffic Kindness | Madhapur ప్రాంతంలో..

వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో భాగంగా ఇన్​స్పెక్టర్​ ఆరె శ్రీధర్​కుమార్​ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్న Cyberabad Traffic Police సిబ్బంది గ్రేటర్​ హైదరాబాద్​ నగరంలోని Madhapur ప్రాంతంలో ఉన్న ఎన్‌ఐఏ బస్‌ స్టాప్‌ వద్ద రోడ్డుపక్కన ఒక వ్యక్తి క్షీణ స్థితిలో పడిఉన్నట్టు గమనించారు. వెంటనే అతని వద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు.

Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు

ఆ వ్యక్తి తన పేరు గోపి అని చెప్పి, తాను చాలా ఆకలితో ఉన్నానని ట్రాఫిక్ పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతనికి ఆహారం ఏర్పాటు చేశారు. సమోసాలు తీసుకువచ్చి అతనికి ఇచ్చి ఆకలి తీర్చారు.

ఇంతటితో ఆగకుండా మాధాపూర్ ట్రాఫిక్ సిబ్బంది అతనికి మరింత సహాయం చేశారు. అతనికి హెయిర్‌కట్‌, షేవింగ్‌ చేయించి శుభ్రంగా తయారు చేయించారు. దీంతో అతనికి తిరిగి ఆత్మగౌరవం, సౌకర్యం కలిగేలా చూసుకున్నారు.

ఈ ఘటనను Cyberabad Traffic Police తమ అధికారిక సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. పోలీసుల ఈ చిన్న సహాయం సమాజంలో మానవత్వానికి మంచి ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న వ్యక్తికి సహాయం చేసి మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు.

 

🚓💙 Humanity in Uniform – A Small Act of Kindness

During the Hon’ble CM Bandobust duty today, near the NIA Bus Stop, traffic personnel noticed a man lying by the roadside in a distressed condition.

On speaking with him, he introduced himself as Gopi, and said he was hungry.… pic.twitter.com/pzzJZUYt4T

— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) March 7, 2026

Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:Cyberabad Traffic KindnessCyberabad Traffic PoliceHyderabad newsHyderabad traffic policeinspiring police storyMadhapur newspolice humanity storytraffic police help
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article akshara sisters Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
Next Article Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?