అక్షరటుడే, కామారెడ్డి: Dalit Boycott Complaint | తాము డప్పులు కొట్టడం లేదనే కారణంతో గ్రామం నుంచి తమను బహిష్కరిస్తామంటున్నారని(Kamareddy News) నర్సన్నపల్లి గ్రామ దళితులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Dalit Boycott Complaint | ఆలయానికి సున్నం వేయకపోవడంతో..
ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది గ్రామపంచాయతీ (Telangana News) ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు సున్నాలు వేయడం జరుగుతుందని, ఉగాది కంటే ఒకరోజు ముందు అన్ని ఆలయాలకు సున్నాలు వేసి దళితులకు సంబంధించిన పోచమ్మ ఆలయానికి సున్నం వెయ్యలేదన్నారు. ఆలయం వద్ద వెలుతురు కోసం లైట్ కూడా బిగించలేదన్నారు. ఇదేమిటని చాకలి కులస్థులను(Social Discrimination India) అడిగితే ‘మేము మీ దేవతలకు సున్నం వేయం.. మీరు మాకు డప్పులు కొట్టడం లేదు.. మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోవచ్చు’ అనడమే కాకుండా గ్రామం నుంచి(Telangana News) ఎస్సీలను బహిష్కరణ చేస్తున్నామని గ్రామ సర్పంచ్‌తో పాటు చాకలి కులస్థులు(Village Dispute) మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను రికార్డ్ చేసినట్లు తెలిపారు.
ఈ విషయమై ఉగాది ముందు రోజే దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీసులు విచారణ జరిపి చర్యలు(Caste Issue India) తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామానికి వెళ్లామని, మూడు రోజులు కావస్తున్న పోలీసులు కనీసం వారిని పిలిపించి మాట్లాడకుండా పోలీసుల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. తమను గ్రామం నుంచి బహిష్కరణ చేస్తామంటున్న సర్పంచ్, చాకలి కులస్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Dalit Boycott Complaint, Kamareddy News, Telangana News, SC ST Atrocity, Social Discrimination India, Village Dispute, Police Complaint India,

