అక్షరటుడే, కామారెడ్డి: Dalit Temple Entry Protest | తమను గ్రామంలోని ఆలయాల్లో ప్రవేశం చేయిస్తామని (Dalit protest) హామీఇచ్చి ఉన్నతాధికారులు రాకపోవడంతో పాటు (Kamareddy) డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐలను పంపడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకుకలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు చివరకు ఆర్డీవోతో ఫోన్ మాట్లాడించడంతో దళితులు శాంతించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Dalit Temple Entry Protest | గతంలో ముగ్గురిపై కేసులు..
గ్రామంలో దళితుల పట్ల ఇతర కులస్థులు, సర్పంచ్ చిన్నచూపు చూస్తున్నారని, తమను గ్రామం నుంచి బహిష్కరిస్తారని బెదిరిస్తున్నారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ముగ్గురిపై కేసు నమోదు కాగా సోమవారం గ్రామానికి కలెక్టర్, ఎస్పీ వచ్చి గ్రామంలోని ఆలయాల్లోకి దళితులను ప్రవేశం చేయిస్తారని అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో ఉదయమే దళితులు గ్రామంలో ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్లు, కుర్చీలు వేసి ఆలయాల్లో కొట్టడానికి కొబ్బరికాయలు, అందరికీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 11:30 గంటలకు వస్తారని చెప్పినా ప్రజావాణి, వీసీ వల్ల ఆలస్యం అవుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని తిరిగి సమాచారమిచ్చారు. దాంతో సాయంత్రం వరకు దళితులు వేచి చూశారు.
Dalit Temple Entry Protest | అధికారులు రాకపోవడంతో..
మధ్యాహ్నం దాటిపోయినా ఉన్నతాధికారులు రాకపోవడం, డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐలను గ్రామానికి పంపడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు గ్రామంలో అగ్రవర్ణాల (rural issues India) పెద్దలు చిన్నచూపు చూస్తుంటే ఉన్నతాధికారులు కూడా తమపట్ల చిన్నచూపు చూస్తున్నారని భావిస్తూ ఉన్నతాధికారులు రాకపోతే తామే అధికారుల వద్దకు వెళ్తామని (social justice India) అంబేడ్కర్ ఫొటో పట్టుకుని ర్యాలీగా కలెక్టరేట్‌కు (Telangana news) పాదయాత్రగా బయలుదేరారు. గ్రామ స్టేజీ దాటి కాస్త దూరం వరకు వెళ్లగానే కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎస్సై రంజిత్ కుమార్ చేరుకుని దళితులతో మాట్లాడారు. తహశీల్దార్ చేరుకుని ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం కలెక్టర్‌తో పాటు తాను కూడా గ్రామానికి వస్తామని చెప్పడంతో దళితులు వెనుదిరిగారు.
ఇది కూడా చదవండి: Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
