Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Damodar Rajanarsimha | ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వృథానే : మంత్రి రాజనర్సింహ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Damodar Rajanarsimha | ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వృథానే : మంత్రి రాజనర్సింహ

తెలంగాణతాజా వార్తలు

Damodar Rajanarsimha | ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వృథానే : మంత్రి రాజనర్సింహ

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని మంత్రి దామోదర్​ రాజనర్సింహ అన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 10:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Damodar Rajanarsimha

అక్షరటుడే, వెబ్​డెస్క్: Damodar Rajanarsimha | ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదు, ఆవశ్యకం అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ అన్నారు. మనం ఎంత ధనవంతులైనా, ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథానే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా.. లేదా మరేదైన ఫిజికల్ యాక్టివిటీ (Physical Activity)ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.

Contents
  • Damodar Rajanarsimha | గచ్చిబౌలి స్టేడియంలో..
    • Damodar Rajanarsimha | మానసిక ప్రశాంతత

Damodar Rajanarsimha | గచ్చిబౌలి స్టేడియంలో..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar)తో కలిసి రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం యోగా చేశారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం అన్నారు. యోగాతో శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న లైఫ్‌స్టైల్, తీసుకుంటున్న ఆహారం, పొల్యూషన్ కారణంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Damodar Rajanarsimha | మానసిక ప్రశాంతత

యోగా సాధన (Yoga Practice)తో శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు. అంతేగాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కల్తీ, నాసిరకం ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 145 పాలీక్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.యోగా, నేచరోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేస్తున్నట్లు రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 750 మంది యోగా శిక్షకులను నియమించి రోజువారీ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా విద్యను ప్రోత్సహించేందుకు BNYS కోర్సుతో పాటు పీజీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
TAGGED:Damodar RajanarsimhaMinister Ponnam PrabhakarPhysical ActivityYoga Practice
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kakatiya Medical College  Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్​
Next Article Jeevan Reddy KCR Meeting Jeevan Reddy KCR Meeting | నేడు కేసీఆర్​ను కలవనున్న మాజీ మంత్రి జీవన్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?