Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు

తెలంగాణతాజా వార్తలు

Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు

ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన అనర్హత పిటిషన్​ను కొట్టివేయడంపై బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్​ దాఖలు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 12:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Danam Nagender Notices

అక్షరటుడే, వెబ్​డెస్క్: Danam Nagender Notices | ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్​ను ఇటీవల స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ (Speaker Gaddam Prasad Kumar) కొట్టి వేసిన విషయం తెలిసిందే. స్పీకర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Contents
  • Danam Nagender Notices | ఆధారాలు లేవని..
    • Danam Nagender Notices | కోర్టు ఎం చెబుతుందో..

మహేశ్వర్​రెడ్డి పిటిషన్​పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీ చేశారని మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పిటిషన్​లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు (High Court Notices) జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

Danam Nagender Notices | ఆధారాలు లేవని..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. వారిపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు వేశారు. స్పీకర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో విచారణ చేపట్టిన స్పీకర్​ అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు చెప్పారు. వాళ్లు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేల జీతం నుంచి బీఆర్​ఎస్​ పార్టీ ఫండ్​ కట్ అవుతుందని, వారు బీఆర్ఎస్​లోనే ఉన్నారని పేర్కొన్నారు.

Danam Nagender Notices | కోర్టు ఎం చెబుతుందో..

పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. అందరి అనర్హత పిటిషన్లను స్పీకర్​ డిస్మిస్​ చేశారు. అయితే ఇందులో ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్​లో చేరి ఆ పార్టీ టికెట్​పై ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్​ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే స్పీకర్​ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుంతో చూడాలి.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
TAGGED:BJP MLADanam Nagender NoticesHigh Court NoticesSpeaker Gaddam Prasad KumarSupreme Court
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad BJP Protest Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Next Article Gold Price Fall Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?