అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టులో బీజేపీ (BJP) పిటిషన్ వేసింది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆయనపై కోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇటీవల కొట్టేసిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
Danam Nagender | కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో..
దానం నాగేందర్ బీఆర్ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎన్నికల్లో పోటీ చేసినా.. స్పీకర్ పార్టీ మారరు అనడానికి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. మరి స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

దీనిని కూడా చదవండి : KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్

