అక్షరటుడే, కామారెడ్డి: Degree College Land Issue | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) భూముల అన్యాక్రాంతంపై స్పష్టత ఇవ్వాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని (MLA Kvr) ఎన్ఎస్యూఐ (NSUI protest) జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాశారు.
Degree College Land Issue | నా వద్ద అన్ని ఆధారాలున్నాయ్..
ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy news) భూముల్లో జరిగిన అవకతవకలపై ఆధారాలతో వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించకుండానే మొత్తం కళాశాల భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తును కలెక్టర్ కార్యాలయంలో సమర్పించి ఎమ్మెల్యే వెళ్లిపోయారన్నారు. ఆ సమాచారాన్ని తాను తెలుసుకుని విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కమిటీ సభ్యుడిగా ఉండడం, ఆయన తండ్రి కేపీ రాజా రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో నాడు భూదస్త్రాలు వారి వద్దనే ఉండడం వారిపై బాధ్యతను మరింత పెంచుతున్నాయన్నారు.
Degree College Land Issue | డిగ్రీ కళాశాలకు సంబంధించి 26 ఎకరాల భూమిలో..
డిగ్రీ కళాశాలకు సంబంధించిన సుమారు 26 ఎకరాల భూమి (Telangana politics) విషయంలో లీజు, తనఖా వివరాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయన్నారు. కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు కర్షక్ విద్యా పరిషత్, అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు (Aurora Engineering College) ఇచ్చిన లీజ్ డీడ్‌లో ఉన్న సర్వే నంబర్లు 194, 193/2, 196, 197, 185 మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు ఉందన్నారు. యూకో బ్యాంక్‌లో అరోరా ఇంజినీరింగ్ కాలేజీ వారు తనఖా పెట్టిన 201/3, 182/1, 201/5, 203/2, 179 సర్వే నంబర్ల విస్తీర్ణం 26.15 ఎకరాలు పూర్తిగా వేరుగా ఉన్నాయని, 2015 సంవత్సరంలో డీసీవో విచారణ నివేదికలో ఉన్న అరోరా ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 195, 192, 184, 190/3, 196 సర్వే నంబర్ల విస్తీర్ణం 26.6 ఎకరాలపై వివరాలతో సరిపోవడం లేదని పేర్కొన్నారు. మూడు విభాగాల్లో మూడు రకాల భూమి వివరాలు ఉండడంతో డిగ్రీ కళాశాల ఆస్తులు, భూములు అన్యక్రాంతం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
Degree College Land Issue | మూడు నివేదికలు వేర్వేరుగా చూస్తే..
ఈ మూడు నివేదికలు వేర్వేరుగా చూస్తే కళాశాల భూములు 78.21 ఎకరాల భూమి (land irregularities) అరోరా ఇంజినీరింగ్ కాలేజీల పేరు మీద వివాదాస్పదంగా మారిందన్నారు. అరోరా ఇంజినీరింగ్ కాలేజీకి కేటాయించిన భూముల అసలు సర్వే నంబర్లు, విస్తీర్ణంపై పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. లీజు ఒప్పందం, బ్యాంక్ తనఖా పత్రాలను ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. 2015 నాటి డీసీవో విచారణపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే మౌనం పాటిస్తే అది ఆయనపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ బహిరంగ లేఖను ఎమ్మెల్యేకు మెయిల్, వాట్సాప్, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం జరిగిందని, తన లేఖలో పేర్కొన్న అంశాలపై ఎమ్మెల్యే స్పందించి సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
