Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్

జాతీయం

Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పీలిభిత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌గా గుర్తించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 6:51 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Delhi Assembly Security Breach

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అసెంబ్లీ ఆవరణలో కారుతో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు సరబ్‌జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, కారును రూప్ నగర్ దగ్గర స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని కారుతో అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ముందు అతడు అసెంబ్లీ గేటు నంబర్​ 2ను ఢీకొని లోనికి వెళ్లాడు. ఓ పుష్పగుచ్చాన్ని స్పీకర్​ కార్యాలయం​ వద్ద ఉంచాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. దీంతో పుష్పగుచ్ఛంలో బాంబు ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం అందులో బాంబు లేదని తేల్చారు.

Delhi Assembly Security Breach | ప్రత్యేక బృందాలతో గాలింపు

భద్రతా ఉల్లంఘన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ (Delhi Police Commissioner) సతీష్ గోల్చా అసెంబ్లీకి చేరుకున్నారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) అనిల్ శుక్లా, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) రవీంద్ర యాదవ్, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు అప్పటికే ఘటనా స్థలంలో ఉన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పీలిభిత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

దీనిని కూడా చదవండి : Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్‌కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు

Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా
TAGGED:car crash incidentdelhi assemblyDelhi Policeindia newsLaw and Ordersecurity breach
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dog Bite | Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..
Next Article Caste Abuse Case | Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?