Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi CCTV Removal | ఢిల్లీలో భారీగా సీసీ కెమెరాల తొలగింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi CCTV Removal | ఢిల్లీలో భారీగా సీసీ కెమెరాల తొలగింపు

జాతీయం

Delhi CCTV Removal | ఢిల్లీలో భారీగా సీసీ కెమెరాల తొలగింపు

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో అమర్చిన లక్షకు పైగా సీసీ కెమెరాలను తొలగించనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:33 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Delhi CCTV Removal

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi CCTV Removal | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో అమర్చిన లక్షకు పైగా సీసీ కెమెరాలను తొలగించనుంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని వీటిని తీసి వేస్తున్నట్లు తెలిపింది.

Contents
  • Delhi CCTV Removal | చైనా కంపెనీకి చెందినవి
    • Delhi CCTV Removal | సురక్షితమైన వాటితో భర్తీ

ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) హయాంలో నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చైనాలో తయారైన 1.4 లక్షల సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని దశలవారీగా తొలగించే ప్రక్రియను ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2,74,389 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2020 సెప్టెంబర్​ నుంచి 2022 నవంబర్​ వరకు 1.40 లక్షల కెమెరాలను అమర్చారు. 2025 జూన్​ నుంచి 2026 మార్చి వరకు 1,34,389 కెమెరాలు ఏర్పాటు చేశారు.

Delhi CCTV Removal | చైనా కంపెనీకి చెందినవి

మొదటి దశలోని ఏర్పాటు చేసిన కెమెరాలు అన్ని చైనా కంపెనీ హిక్‌విజన్‌కు చెందినవి. ఇది ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది. మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ (Minister Parvesh Sahib Singh) మాట్లాడుతూ, ఢిల్లీ అంతటా చైనాకు చెందిన హిక్‌విజన్ కెమెరాలను ఏర్పాటు చేసేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దీర్ఘకాలిక భద్రతా పరిణామాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. నిఘా అనేది కేవలం ప్రదర్శన కోసం పెట్టే విషయం కాదని, ఇది సున్నితమైన డేటా నియంత్రణకు సంబంధించిన సమస్య అన్నారు. ఇది జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

Delhi CCTV Removal | సురక్షితమైన వాటితో భర్తీ

అధిక డేటా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆధునిక, సురక్షితమైన సాంకేతికంగా ఉన్నతమైన వ్యవస్థలతో కెమెరాలను దశలవారీగా భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. నిఘాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియను దశలవారీగా నిర్వహిస్తామని వెల్లడించారు. మొదటి దశలో 50 వేల చైనా కెమెరాలను మార్చడానికి ఆమోదం లభించింది.

ఇది కూడా చదవండి..: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
TAGGED:Aam Aadmi PartyAAP CCTV projectCCTV policy IndiaDelhi CCTV RemovalDelhi GovernmentDelhi security newsHikvision cameras IndiaMinister Parvesh Sahib Singhnational security Indiasmart city surveillancesurveillance India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India Car Sales Growth India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు
Next Article Hanuman Jayanti Hanuman Jayanti | ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే ధన్​పాల్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Central Government Salary Hike | ఉద్యోగులకు వేతనం పెంపు!..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?