Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు

జాతీయంతాజా వార్తలు

Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో సంభవించిన 5.9 తీవ్రత గల భూకంపం కలకలం రేపింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 4, 2026 8:26 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
Delhi Earthquake
Delhi Earthquake

అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ప్రకృతి ప్రళయం విషాదాన్ని మిగిల్చింది. హిందూకుష్ పర్వత శ్రేణిలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం Earthquake తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Contents
  • Delhi Earthquake |భారత్‌లోనూ ప్రకంపనలు
    • Delhi Earthquake | అకాల వర్షం

ఈ భూకంపం కేంద్రం భూమి అంతర్భాగంలో సుమారు 150 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కాబూల్ సమీపంలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మరణించారు. ఈ ఘటనలో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Delhi Earthquake |భారత్‌లోనూ ప్రకంపనలు

ఈ భూకంప ప్రభావం భారత్‌లోనూ India గట్టిగానే కనిపించింది. శుక్రవారం రాత్రి సుమారు 9:50 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు చండీగఢ్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Delhi Earthquake | అకాల వర్షం

కొద్ది సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనల వల్ల ఫ్యాన్లు, మంచాలు, గృహోపకరణాలు కదిలినట్లు ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప సమయంలో ఢిల్లీలో అకాల వర్షం కురుస్తుండటం పరిస్థితిని మరింత భయానకంగా మార్చింది. ఒకవైపు వర్షం, మరోవైపు భూమి కంపించడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

అలాగే శ్రీనగర్, ఉధంపూర్ ప్రాంతాల్లో కూడా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. ఈ భూకంపం ప్రభావం పొరుగు దేశమైన పాకిస్తాన్​లో కూడా కనిపించింది.

ఇస్లామాబాద్, లాహోర్ Lahore, పెషావర్ నగరాల్లో ప్రజలు ప్రకంపనలను స్పష్టంగా అనుభవించారు. హిందూకుష్ పర్వత శ్రేణి భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించబడింది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అధిక లోతులో భూకంప కేంద్రం ఉండటం వల్ల ప్రకంపనలు విస్తృత ప్రాంతాలకు వ్యాపిస్తాయి.

AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
April 02 Pre Market Analysis | ట్రంప్ హెచ్చరికలతో నష్టాల్లో మార్కెట్లు.. భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
TAGGED:5.9 magnitude quakeDelhi Earthquakedelhi newsearthquake Indiaearthquake todayIndia Breaking NewsNCR tremorsseismic activity India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Next Article April 04 Gold Rates April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. మళ్లీ ఎగసిప‌డుతున్న‌ బంగారం ధర.. శాంతించిన వెండి
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?