అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఢిల్లీ పాలం ప్రాంతంలోని సాధ్ నగర్ (Sadh Nagar)లో ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదం (Fire Accident)లో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం తొమ్మిది మంది మరణించారని అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. భవనం నుంచి దూకిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో మరణించడంతో మృతుల తొమ్మిదికి పెరిగిందని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ ఎస్.కె. దువా తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాస్మెటిక్ షాపులో మండే స్వభావం గల వస్తువులు ఉండటంతో మంటలు వ్యాపించాయన్నారు.
Delhi Fire Accident | 30 ఫైర్ ఇంజిన్లతో..
పాలం మెట్రో స్టేషన్ (Palam Metro Station) సమీపంలోని ఒక భవనంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 30 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. భవనంలో బేస్‌మెంట్, గ్రౌండ్, మొదటి అంతస్తులలో దుకాణాలు ఉండగా, రెండు, మూడవ అంతస్తులలో నివాసాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మంటల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇద్దరు భవనంపై నుంచి దూకారు. తీవ్రంగా గాయపడ్డ వారు ఆస్పత్రిలో మృతి చెందారు.
Delhi Fire Accident | విచారణకు ఆదేశం
అగ్నిప్రమాదంపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా (CM Rekha Gupta) తెలిపారు. ఈ దురదృష్టకర ప్రమాదం గురించి తెలుసుకుని తాను తీవ్రంగా కలత చెందానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధికారులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

