అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది.
లిక్కర్ కేసు (Liquor Case)పై తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులపై నమోదు చేసిన కేసులు కొట్టేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండానే.. వీళ్ల పేర్లు కేసులో చేర్చారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు తప్పు చేశారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.
Delhi Liquor Case Relief | లోపభూయిష్టమైన దర్యాప్తు
లిక్కర్ కేసులో లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని న్యాయస్థానం సీబీఐపై ఆగ్రహించింది. ఈ విషయంలో సీబీఐ అధికారుల (CBI Officers)పై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కవిత ఆడిటర్ అయిన బుచ్చిబాబుతో పాటు అభియోగాలు మోపబడిన 23 మందికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది.
Delhi Liquor Case Relief | అసలేం జరిగిందంటే..!
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అనంతరం 2022 సెప్టెంబర్ చివరికి వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో లిక్కర్ విధానంలో అవకతవకలు జరిగాయని.. ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Delhi Liquor Case Relief | అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
ఎక్సైజ్ పాలసీని సవరించిన సమయంలో వీరు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేశారని.. ఇందుకు ప్రతిఫలంగా కొంత మొతం పొందారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ స్కాంలో భాగంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పలువురు ఆప్ నేతలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలను అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. తాజాగా కోర్టు ఆదేశాలతో వారికి ఊరట లభించినట్లయ్యింది.
ఇది కూడా చదవండి..: Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్ ట్విస్ట్.. సీఎం మార్పు తప్పదా!

