అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Liquor Case Verdict | ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మాజీ మంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
Delhi Liquor Case Verdict | సత్యమే గెలుస్తుంది
రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ కేసులో పలువురికి క్లీన్ చిట్ ఇచ్చింది.కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. సీబీఐ కేసులో నిందితులుగా ఉన్న 23 మందిని ఢిల్లీలోని కోర్టు విడుదల చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే, కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు. తనపై ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు.
Delhi Liquor Case Verdict | అవినీతిపరుడిని కాదు
తాను అవినీతిపరుడిని కాదని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కట్టర్ ఇమాందార్ (పూర్తిగా నిజాయితీపరులు) అని కోర్టు తెలిపిందన్నారు. గతంలో ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వం నగరంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన కేసు లైసెన్స్ ఫీజులను తగ్గించడం, లాభాల మార్జిన్లను నిర్ణయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలను కలిగించిందని, కొన్ని ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. కేజ్రీవాల్, సిసోడియాతో సహా 23 మంది నిందితులను విడుదల చేసింది.
కేజ్రీవాల్, సిసోడియాలతో పాటు నిందితులు కె కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోర్నట్ల, రాకేష్ జోషి, దామోదర్ సింగ్, ప్రసాద్ కుమార్, అర్ప్రీత్ శర్మ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పి శరత్ చద్రారెడ్డికి కూడా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి..: Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్ కేసు.. కేజ్రీవాల్, కవితకు బిగ్ రిలీఫ్

