Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

జాతీయం

Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్​ చేసింది.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 7:05 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Delhi Liquor Scam Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Liquor Scam Case | ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు (Delhi Liquor Scam Case)ను రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్​ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్​చిట్​ ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది.

Contents
  • Delhi Liquor Scam Case | సీబీఐకి మందలింపు
    • Delhi Liquor Scam Case | రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే..
      • పరిగణనలోకి తీసుకోకపోవడంతో..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 23 మంది నిందితులను విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు సీబీఐ పిటిషన్​ వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ నిందితులపై ప్రారంభించిన కేసును కొట్టివేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి విస్తృత కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేదని తీర్పు చెప్పింది.

Delhi Liquor Scam Case | సీబీఐకి మందలింపు

సీబీఐ (CBI) ఊహ ఆధారంగా కుట్ర కథనాన్ని నిర్మించడానికి ప్రయత్నించినందున ప్రాసిక్యూషన్ కేసు న్యాయ పరిశీలన నుంచి బయటపడలేదని ప్రత్యేక కోర్టు తెలిపింది. 23 మంది నిందితులలో ఎవరిపైనా ప్రాథమికంగా ఎటువంటి కేసు నమోదు కాలేదని పేర్కొంది. అప్రూవర్ స్టేట్‌మెంట్‌ల ద్వారా కేసును నిర్మించినందుకు ప్రత్యేక కోర్టు సీబీఐని మందలించింది.

Delhi Liquor Scam Case | రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే..

ఇలాంటి ప్రవర్తనకు అనుమతిస్తే రాజ్యాంగ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. నిందితుడికి క్షమాభిక్ష పెట్టి, ఆ తర్వాత అప్రూవర్‌గా చేయడం, దర్యాప్తులో ఉన్న ఖాళీలను పూరించడానికి, అదనపు వ్యక్తులను నిందితులుగా చేయడానికి అతని ప్రకటనలు ఉపయోగించడం తప్పు అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని (కుల్దీప్ సింగ్) నంబర్ వన్ నిందితుడిగా చేసిన సీబీఐ అధికారులపై విచారణకు సిఫార్సు చేస్తామని కోర్టు తెలిపింది.

పరిగణనలోకి తీసుకోకపోవడంతో..

లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కోర్టు అభియోగాల రూపకల్పన స్థాయిలో విస్మరించబడిన, పరిగణించబడని అనేక అంశాలను ఏజెన్సీ గుర్తించిందని వర్గాలు తెలిపాయి. దర్యాప్తులోని అనేక అంశాలను విస్మరించడం, తగినంతగా పరిగణించకపోవడంతో ట్రయల్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తక్షణమే హైకోర్టులో అప్పీల్ చేయాలని సీబీఐ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి.. : Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్

Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
TAGGED:Arvind KejriwalCBI AppealDelhi High CourtDelhi Liquor Scam CaseExcise Policy CaseIndian Political NewsKavitha TelanganaManish Sisodia
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article National Education Policy 2020 | National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
Next Article Collector Ila Tripathi comments | Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?