అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామా చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారం మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సహా మరో 23 మందికి సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై నోటీసులు జారీ చేసింది. కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వగా.. సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్‍పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దర్యాప్తు సంస్థపై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. అలాగే తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం విచారణ జరుగనుంది. కాగా.. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
Delhi Liquor Scam | మార్చి 16 వరకు వాయిదా
హైకోర్టు ఈ అప్పీల్‌పై మార్చి 16న తుది నిర్ణయం తీసుకునే వరకు ఈడీ విచారణ (ED Investigation)ను వాయిదా వేయాలని కోర్టు ఆదేశించింది. లోయర్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవాలతో సరిపోలడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇది సీబీఐ అప్పీల్‌కు మరింత బలం చేకూర్చింది.
Delhi Liquor Scam | నిర్దోషులుగా ప్రకటించిన లోయర్ కోర్టు
గత వారం ఢిల్లీ స్పెషల్ కోర్టు (Delhi Special Court) మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐని తీవ్రంగా విమర్శిస్తూ “పాలసీలో సమగ్ర కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం కనిపించలేదు” అని వ్యాఖ్యానించింది. సీబీఐ చార్జిషీట్‌పై కాగ్నిజెన్స్ తీసుకోవడానికి నిరాకరించిన జడ్జి జితేంద్ర సింగ్, కేసు కేవలం ఊహాగానాలపై నిర్మించిన కథనం మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇది కూడా చదవండి..: Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు

