అక్షరటుడే, ఇందూరు: Devotion and Service | ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ (Nizamabad) నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్ జంక్షన్ ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Devotion and Service | స్వయంగా వడ్డించి..
కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ (PCC Chief) స్వయంగా హనుమాన్ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి, సేవ అనేవి భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని పేర్కొన్నారు. హనుమాన్ స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నానన్నారు. దీక్షలు తీసుకున్న భక్తుల ఆత్మనిబద్ధత, నియమ నిష్టలు యువతకు ఆదర్శమని తెలిపారు.
Devotion and Service | సమాజంలో పలు సేవా కార్యక్రమాలు..
సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరస్పర సహకారం, సామాజిక ఐక్యత మరింత బలపడుతుందని పీసీసీ చీఫ్ అన్నారు. హనుమాన్ దీక్షా (Hanuman Deeksha) స్వాములకు అన్నప్రసాదం పంపిణీ చేయడం ద్వారా సేవా భావాన్ని చాటుతున్న నగర కాంగ్రెస్ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్షా స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Israel Missile Attack | ఇజ్రాయిల్‌లో కమ్మర్పల్లి వాసికి గాయాలు..

