అక్షరటుడే, కామారెడ్డి: Dhaba Sitting Case | అక్రమంగా దాబాలో సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబా యజమానిపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి (Machareddy Police Raid) ఎస్సై అనిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు.
Dhaba Sitting Case | మాచారెడ్డి మండలంలోని..
మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి గ్రామంలో (Kamareddy Crime News) దాబాపై పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 17.64 లీటర్ల ఐఎంఎల్ మద్యం (IMFL Liquor Seized), 21.1 లీటర్ల బీర్లు (Illegal Liquor Seizure) స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.24,679 విలువ చేసే 38.74 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. దాబా యజమాని మారుపాక ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం విక్రయించడం, దాబాలు, ఇతర ప్రదేశాలలో ప్రజలను కూర్చోబెట్టి మద్యం సేవించేందుకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు..
అక్రమ మద్యాన్ని అరికట్టాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలు ఇచ్చారని ఎస్సై తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దాబాల్లో మద్యంను అనుమతించేది లేదన్నారు. దాబా యజమానులు సైతం ఇతరులు ఎవరైనా మద్యం తాగేందుకు వస్తే వారిని దాబాల్లోకి రానివ్వొద్దని హెచ్చరించారు. మద్యాన్ని అక్రమంగా నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్

